ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: వైఎస్ షర్మిల పర్యటనలో ఉద్రిక్తత.. అడ్డుకున్న వైసీపీ శ్రేణులు

ABN, Publish Date - Apr 12 , 2024 | 05:35 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. కడప లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో ఆ నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టిసారించారు. కడప లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తూ జనంలోకి వెళుతున్నారు. అధికార వైసీపీ నేతలకు షర్మిల పర్యటన కంటగింపుగా మారింది.

YCP Workers Are Stopped To The YS Sharmila

కడప జిల్లా: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) దూసుకెళ్తున్నారు. కడప లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో ఆ నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టిసారించారు. కడప లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తూ జనంలోకి వెళుతున్నారు. అధికార వైసీపీ నేతలకు షర్మిల (Sharmila) పర్యటన కంటగింపుగా మారింది. షర్మిల శుక్రవారం నాడు లింగాల మండలానికి రాగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. షర్మిల పర్యటనను అడ్డుకోవాలని చూశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. అల్లరి చేసే వాళ్లు పులివెందుల రండి. పూల అంగళ్ళ వద్ద పంచాయితీ పెడదాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం అని షర్మిల కోరారు.

AP Election 2024: చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి భేటీ.. ఈ అంశాలపైనే చర్చ!


ఓటమి భయం

వైసీపీ శ్రేణుల తీరును షర్మిల తప్పుపట్టారు. ‘అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. కడప లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన అవినాష్ రెడ్డికి ఓటమి భయం ఉంది. తన పర్యటనకు అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలను తీసివేస్తున్నారు. ఒకప్పుడు జగన్‌కి చెల్లెను కాను బిడ్డను.. సీఎం అయిన తర్వాత ఆ బంధం తెగింది. బాబాయిని చంపిన వాళ్ళను పక్కన పెట్టుకున్నారు. మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు అని’ షర్మిల మండిపడ్డారు.


కోపం లేదు.. కానీ

‘అవినాష్ రెడ్డి అంటే ఇదివరకు కోపం లేదు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ హంతకుడని తేల్చింది. ఆధారాలు బయట పెట్టింది. హత్యకు పెద్ద ఎత్తున లావాదేవీలు నడిచాయి. అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారు. హంతకులకు జగన్ అండగా నిలబడ్డారు. అందుకే కడప ఎంపీగా బరిలోకి దిగా. న్యాయం, ధర్మం ఒక వైపు, అన్యాయం, హంతకులు మరో వైపు ఉన్నారు అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

AP HighCourt: ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై హైకోర్ట్ సీరియస్

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 12 , 2024 | 05:35 PM

Advertising
Advertising