Sharmila vs Jagan: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు అద్దం గిఫ్ట్‌గా పంపిన షర్మిల..
ABN, Publish Date - May 04 , 2024 | 05:38 PM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. జగన్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయంగా ఉంది. అద్దం(Mirror) పంపిస్తున్నా..
కడప, మే 04: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. జగన్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయంగా ఉంది. అద్దం(Mirror) పంపిస్తున్నా.. మీకు మీ మొహం కనిపిస్తుందా? చంద్రబాబు ఫేస్ కనిపిస్తుందా ? నేను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు.. కంట్రోల్ చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క సాక్ష్యం అయినా.. ఒక్క ఆధారం అయినా చూపించగలరా ? జగన్ భ్రమలో ఉన్నాడు. జగన్ ఏదో ఊహల్లో ఉన్నట్లు ఉంది. జగన్ వైఖరి మాలోకంను తలపిస్తుంది. నా జన్మకి నేను చంద్రబాబును ఒక్కసారి మాత్రమే కలిశాను. అదికూడా నా కొడుకు పెళ్లికి పిలవడానికి మాత్రమే వెళ్లాను. ఆనాడు వైఎస్ఆర్ కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. ఆ స్ఫూర్తితోనే నేను చంద్రబాబును పెళ్లికి పిలవడానికి వెళ్లాను. నేను 5 నిమిషాలు కూడా ఏనాడూ బాబుతో మాట్లాడలేదు.’ అని షర్మిల చెప్పుకొచ్చారు.
బాబు చెబితేనే అదంతా చేశానా?
‘నేను చంద్రబాబు చెప్తేనే నీకోసం 3200 KM పాదయాత్ర చేశానా ? ‘బాయ్ బాయ్ బాబు’ అనే క్యాంపెయిన్ చేశానా? సునీత, రేవంత్ కూడా చంద్రబాబు చెప్పినట్లు వింటారట. బీజేపీ పొత్తు కూడా చంద్రబాబు మ్యానేజ్ చేశాడట. చంద్రబాబు ఎంత పవర్ ఫుల్ అయ్యారో.. ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఆలోచన చేయాలి. జగన్ మానసిక పరిస్థితిపై నాకు ఆందోళనగా ఉంది. జగన్ గారు.. మీరు అద్దం చూస్కోండి.. మీకు మీ మొహం కనిపిస్తుందా? చంద్రబాబు మొహం కనిపిస్తుందా? సునీత చేస్తున్న న్యాయ పోరాటం మీకు కనిపించడం లేదా ? హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం, మీ హస్తం లేకుంటే మీకు భయం ఎందుకు?’ అని సీఎం జగన్‌ను షర్మిల నిలదీశారు.
షర్మిల చేసిన కామెంట్స్ యధావిధిగా..
వైఎస్ఆర్ పేరును సీబీఐ చార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్ కాదు.
సీబీఐ చార్జిషీట్‌లో పేరు చేర్పించింది జగన్.
పొన్నవోలుతో పిటీషన్ వేయించి మరి చేర్పించాడు.
నిజానికి కేసు వేసింది మాజీ మంత్రి శంకర్ రావు.. కానీ ఈ కేసు చెల్లలేదు.
ఎర్రంనాయుడు వేసిన పిటీషన్‌ను కోర్టు ఇంప్లేడ్ చేసింది.
విచారణ చేయమని మాత్రమే అనాడు కోర్టు చెప్పింది.
కానీ వైఎస్ఆర్ పేరును అప్పుడు పిటీషన్‌లో చేర్చలేదు.
పొన్నవోలు సుధాకర్‌తో సుప్రీం కోర్టు వరకు వెళ్లి పేరు పెట్టించారు.
ఇదే నిజం. తారు మారు చేసే ప్రయత్నం చేసినా నిజం దాగదు.
గిఫ్ట్ గా అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చారు.
సీఎం అయిన 6 రోజులకే అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు.
మూడు సార్లు చార్జీ షీట్‌లో పెట్టాలి అనుకున్న వ్యక్తికి మీరు పదవి ఇచ్చారు.
ఏ సంబంధం లేకుంటే ఎందుకు ఇస్తారు.
కళ్ళకు ఎదుట అందరికీ స్పష్టంగా కనిపించింది.
కాంగ్రెస్‌కి సీబీఐ ఛార్జ్ షీట్‌కి సంబంధం లేదు.
మమ్మల్ని ఈ విషయంలో ఊసరవెల్లి అంటున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందని నేను చెప్పినట్లు వీడియోలు ప్లె చేస్తున్నారు.
నిజానికి ఆరోజు నాకు నిజం తెలియదు.
నేను కాంగ్రెస్ పెట్టించింది అనుకున్నాను.
సోనియాను కలిశాక అసలు విషయం తెలుసుకున్నాను.
సోనియా నాతో మేము ఎందుకు పెడతాం అని చెప్పారు.
ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలసినప్పుడు కూడా తెలుసుకున్నాను.
జగన్ కావాలని పెట్టించినట్లు ఉండవల్లి స్పష్టం చేశారు.
అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాతనే నేను కాంగ్రెస్ పెట్టలేదు అని చెప్తున్నాను.
వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
జగన్ కూడా ఆరోపణలు చేశారు.
రిలియన్స్ ఆస్తులను ధ్వంసం చేశారు.
జగన్ సిఎం అయ్యాక రెలియన్స్ చెప్పిన వాళ్లకు రాజ్యసభ ఇచ్చారు.
తాను చెప్పింది అబద్ధం అని నిరూపించుకున్నారు.
వివేకా హత్య తర్వాత చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణ చేశాడు.
సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశాడు.
సీఎం అయ్యాక సీబీఐ విచారణ వద్దు అన్నారు.
నిజంగా చంద్రబాబు హస్తం ఉంటే ఎందుకు సీబీఐ విచారణ వద్దు అన్నారు ?
మీరు అప్పుడొక మాట.. ఇప్పుడు ఒక మాట మాట్లాడారు.
సొంత తండ్రి పేరును FIR లో పెట్టించిన వ్యక్తికి మీరు పదవి ఇస్తారా ?
మీకు మీరు ఒకసారి ఆలోచన చేయండి.
ఈ మధ్య జగన్ నేషనల్ మీడియాకి ఇంటర్వూలు ఇస్తున్నారు.
నేను చంద్రబాబు మనిషి అంటున్నాడు.
నన్ను చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నాడట.
నేను బాబు మాట వింటున్నానట.
నేను వైఎస్ఆర్ బిడ్డను.. నేను ఎంత మొండి దాన్నో జగన్‌కి తెలుసు.
నేను ఎవరో కంట్రోల్ చేస్తే తిరిగే వ్యక్తిని కాదు.
నాకు ఎవరో ఏదో చెప్తే నమ్మే వ్యక్తిని కాదు.
For More Andhra Pradesh and Telugu News..
Updated Date - May 04 , 2024 | 05:45 PM