YS Sunitha: నేను ప్రజల ముందుకొస్తే.. వైసీపీ నేతల్లో వణుకు పుట్టి..
ABN, Publish Date - Apr 19 , 2024 | 02:20 PM
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై మాట్లాడకూడదంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడంపై వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి స్పందించారు. ‘‘న్యాయం కోసం ఇప్పుడు నేను ప్రజల ముందుకు వస్తే.. ఏం చేయాలో తోచక వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టు కెళ్లారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పులివెందులలో వైఎస్ సునీతా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కడప, ఏప్రిల్ 19: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై (YS Viveka Murder Case) మాట్లాడకూడదంటూ వైసీపీ నేతలు (YSRCP Leaders) కోర్టుకు వెళ్లడంపై వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి (YS Sunitha Reddy) స్పందించారు. ‘‘న్యాయం కోసం ఇప్పుడు నేను ప్రజల ముందుకు వస్తే.. ఏం చేయాలో తోచక వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టుకెళ్లారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పులివెందులలో వైఎస్ సునీతా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. తన తండ్రి వివేకా హత్యకు గురై ఐదేళ్లుగా న్యాయపోరాటం చేసేది ప్రజలందరికీ తెలుసన్నారు.
YS Sharmila: ఇక్కడ ఫెయిల్ అయిన వ్యక్తి ఇంకో దగ్గర ఎలా పనికొస్తాడు?.. గుమ్మనూరుపై షర్మిల ఫైర్
ఈ ఐదేళ్లలో బయట మీడియా ముందు మాట్లాడింది ఐదుసార్లు మాత్రమే అని చెప్పుకొచ్చారు. తనకు జరిగిన అన్యాయంపై గత రెండు నెలలుగా మాట్లాడడం మొదలు పెట్టానన్నారు. ఈ ఐదేళ్లలో వివేకాను ఎంత అవమానించారో.. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడారో అందరికి తెలుసన్నారు. ఐదేళ్లుగా నరకం చూపించిన ఇదే వైసీపీ నేతలు.. ఇప్పుడు న్యాయం కోసం ప్రజల ముందుకు వెళితే అనేక రకాలుగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను మళ్లీ ఎక్కడ పై కోర్టుకు వెళతానో అని పులివెందుల నియోజకవర్గంలో తమకు సాయం చేసే వారిని బెదిరిస్తున్నారని అన్నారు. అవతల పార్టీ స్టేట్‌మెంట్ కూడా వినకుండా ఏకపక్షంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని వైసీపీ వారు రూల్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశఆరు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులకు ఓటు వేయవద్దని పులివెందుల ప్రజలను కోరారు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకు ఓటువేసి పార్లమెంటుకు పంపాలంటూ పులివెందుల ప్రజలను వైఎస్ సునీత కోరారు.
Updated Date - Apr 19 , 2024 | 02:52 PM