మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు... టీడీపీలోకి అధికారపార్టీ నేతల క్యూ...

ABN, Publish Date - Apr 13 , 2024 | 09:42 AM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అధికారపార్టీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. రాక్షస పాలన వద్దు - రామునే కావాలి అంటూ టీడీపీలోకి చేరుతున్నారు. అధికార పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తూ నిన్న (శుక్రవారం) నందివాడ, నేడు గుడ్లవల్లేరు మండలాల్లో టీడీపీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. టీడీపీ నేత వెనిగండ్ల రాము సమక్షంలో వైసీపీ వైస్ సర్పంచ్ సహా 100 మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

AP Elections: వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు... టీడీపీలోకి అధికారపార్టీ నేతల క్యూ...
YSRCP leaders are joining TDP

కృష్ణా జిల్లా, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న తరుణంలో అధికారపార్టీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు (YSRCP Leaders) టీడీపీలో (TDP) చేరేందుకు క్యూ కడుతున్నారు. రాక్షస పాలన వద్దు - రామునే కావాలి అంటూ టీడీపీలోకి చేరుతున్నారు. అధికార పార్టీకి షాక్ మీద షాక్ ఇస్తూ నిన్న (శుక్రవారం) నందివాడ, నేడు గుడ్లవల్లేరు మండలాల్లో టీడీపీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. టీడీపీ నేత వెనిగండ్ల రాము సమక్షంలో వైసీపీ వైస్ సర్పంచ్ సహా 100 మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పోలింగ్‌లో ప్రజలు నొక్కే బటన్‌లకు - కొడాలి నాని, జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.

AP Politics: ‘బ్రహ్మారెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా?!’


ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా తట్టుకోలేరు..

ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. పోలింగ్‌లోపు గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవ్వబోతుందని అన్నారు. జూన్ 4 తర్వాత గుట్కా నాని శాశ్వతంగా ఇంట్లోనే కూర్చుంటాడంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చూపించేది ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమాను తట్టుకోలేడని... అహంకారానికి ప్రజల మద్దతుతో గుణపాఠం చెబుతానని స్పష్టం చేశారు. త్రాగునీరు, సాగునీరు అందించలేని పనికిమాలిన ఎమ్మెల్యేను ఎందుకు సహించాలన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి ముచ్చకైన కనబడటం లేదని విమర్శించారు. జగన్ దుర్మార్గం ప్రజలకు అర్థమైందని, వాలంటీర్లు కూడా అర్థం చేసుకోండని.. ప్రజల పక్షాన నిలపడాలని కోరారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ, ఓట్ల కోసం శవరాజకీయాలు చేసే నీచ సంస్కృతిని జగన్ వెంట తిరిగే వాళ్ళే అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు, నేతలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా రావడం శుభపరిణామమన్నారు.

AP Politics: మా వాళ్లనే అరెస్టు చేస్తారా?.. పీఎస్‌లో బాలినేని హల్‌చల్..


గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని పార్టీలో చేరిన వారందరికీ తప్పకుండా తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలో మూడు రోజులు దృష్టి పెడితే ప్రజల త్రాగునీటి, సాగునీటి సమస్యలు పరిష్కరించవచ్చని... ఆ తీరిక ఎమ్మెల్యేకు లేదని మండిపడ్డారు. వరదలకు పంటలు మునిగి రైతులు నష్టపోతే, తాపీగా వచ్చి ఫోటోలకు ఫోజులిస్తూ ఒక్క ఎకరా కూడా మునాగలేదంటూ ఇదే గ్రామంలో రైతులను అవమానిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా ప్రజలతో కలిసే ప్రయాణిస్తానని స్పష్టం చేశారు. ఆదాయాన్ని పెంచి ప్రజల మంచి కోసం ఖర్చుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. జగన్ & కో చేసిన విధ్వంసం, అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని... కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయకత్వం ఆక్సిజన్‌లా బతికిస్తుందని వెనిగండ్ల రాము పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Children Bank Of India: నకిలీ నోట్ల దందా.. అడ్డంగా పట్టించిన ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’

Hyderabad: మల్కాజిగిరి.. ‘హస్తం’ గురి! పైచేయి కోసం కసరత్తు

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 13 , 2024 | 10:09 AM

Advertising
Advertising