AP Election 2024:వెబ్ క్యాస్టింగ్‌పై వైసీపీ కుట్ర.. ఎన్నికల కమిషన్ ఏం చేసిదంటే..?
ABN, Publish Date - May 12 , 2024 | 06:57 PM
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోంది. సమస్యాత్మాక నియోజకవర్గాలో ఈసీ ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ లేకుండా చేసేందుకు ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అల్లర్లు జరుగుతాయని భావించి ముందుగానే ఎలక్షన్ కమిషన్ (Election Commission) వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసింది. వెబ్ క్యాస్టింగ్‌ను ట్రైల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ కుయుక్తులు బయట పడ్డాయి.
అమరావతి: పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోంది. సమస్యాత్మాక నియోజకవర్గాలో ఈసీ ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ లేకుండా చేసేందుకు ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అల్లర్లు జరుగుతాయని భావించి ముందుగానే ఎలక్షన్ కమిషన్ (Election Commission) వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసింది. వెబ్ క్యాస్టింగ్‌ను ట్రైల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ కుయుక్తులు బయట పడ్డాయి.
మాచర్ల నియోజకవర్గంలోని పేట సన్నిగండ్ల పోలింగ్ కేంద్రంలో అమర్చిన వెబ్ కెమెరాకు వైసీపీ మూకలు వైర్లు కట్ చేశారు. వైర్లు కట్ చేసిన విషయం గుర్తించి పోలీసులకు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసింది. వెబ్ క్యాస్టింగ్‌ను నిలిపివేసి పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు చేయడమే కాకుండా.. రిగ్గింగ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయి. వెబ్ క్యాస్టింగ్‌ను ఆదివారం కూడా ట్రైల్ రన్‌ను ఎన్నికల కమీషన్ నిర్వహించింది. అన్ని వెబ్ కెమెరాల నుంచి రాష్ట్ర సీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. అక్రమాలను పసిగడతారనే భయంతోనే వెబ్ క్యాస్టింగ్‌ను డిస్టబ్ చేసే కుట్ర పన్నుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?
Read Latest AP News And Telugu News
Updated Date - May 12 , 2024 | 07:00 PM