ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Prudhvi Raj: నేను డ్యాన్స్ చేస్తే ఆ మంత్రి తట్టుకోలేకపోయారు

ABN, Publish Date - Apr 05 , 2024 | 04:45 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)ని మడతపెడతామనే మాటే అన్నివర్గాల నోటా వినిపిస్తోందని జనసేన (Janasena) నేత, సినీనటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) అన్నారు. ఏ సర్వే చూసినా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధ్బుత విజయo ఖాయమని స్పష్టమవుతోందని చెప్పారు. ఉండవల్లిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) ని పృథ్వీరాజ్ శుక్రవారం నాడు కలిశారు.

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)ని మడతపెడతామనే మాటే అన్నివర్గాల నోటా వినిపిస్తోందని జనసేన (Janasena) నేత, సినీనటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) అన్నారు. ఏ సర్వే చూసినా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధ్బుత విజయo ఖాయమని స్పష్టమవుతోందని చెప్పారు. ఉండవల్లిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) ని పృథ్వీరాజ్ శుక్రవారం నాడు కలిశారు. తెలుగుదేశం- జనసేన - బీజేపీ ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో రూపొందించాల్సిన ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ... పులివెందుల రెడ్లే ఈసారి జగన్ గెలవడం కష్టమని చెబుతున్నారని అన్నారు.


Nara Bhuvaneshwari: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబుపై రుద్దుతున్నారు

వైసీపీలో ఉన్నప్పుడు తన చిప్ సరిగా పనిచేయక టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేశానని అందుకు క్షమాపణలు కూడా చెప్పానని అన్నారు. తనకు కోవిడ్ వచ్చినప్పుడు బెడ్ అవసరమైతే అధికారంలో ఉన్న వైసీపీ పట్టించుకోలేదని మండిపడ్డారు. మెగా బ్రదర్స్ బెడ్ ఏర్పాటు చేయిస్తే బతికి బయటపడ్డానని చెప్పారు. తానో సినిమాలో డాన్స్ చేస్తే సంబరాల మంత్రి( అంబటి రాంబాబుని ఉద్దేశించి..) తట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. సంజన, సుకన్య అంటూ పరితపించే ప్రజా ప్రతినిధులు వైసీపీలో ఉన్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో వైసీపీ మొదటి ఓడిపోయే సీటు నగరేనని చెప్పారు.


AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన గుంటూరు, అనంత కీలక నేతలు

నోరుంది కదా అని ఎలా పడితే అలా వాడేస్తే... ఫలితం ఎలా ఉండబోతోందో రోజా చూస్తుందన్నారు. జగన్ అన్న వదిలిన బాణం(వైఎస్ షర్మిలని ఉద్దేశించి..) వైసీపీనే పొడుస్తోందని ఆ పోటు దెబ్బ 12శాతం ఓట్లపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ ఎన్నికల్లో175కి 175 సీట్లు అని విర్రవీగే వైసీపీ టైమ్ ఇక అయిపోయిందని ఆక్షేపించారు. ఉమ్మడి ప్రచార కార్యక్రమాలు కలసి కట్టుగా రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 18 నుంచి ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.


2019లో తాడేపల్లి క్యాంపు ఆఫీస్ వద్ద వైసీపీ విజయానికి టపాసులు కాల్చిన తాను, ఈసారి ఆ పార్టీ ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతానని అన్నారు. 2024లో జగన్‌కి ప్రజలతో పాటు ప్రకృతి కూడా సమాధానం చెబుతుందన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై సచివాలయానికి చిరంజీవి వస్తే జగన్ అవమానించి పంపారని ధ్వజమెత్తారు. చిరంజీవి పెద్దరికంగా ఆలోచిస్తారు కాబట్టి జగన్ చేసిన అవమానంపై స్పందించలేదని చెప్పారు. వింత జీవుల్ని ఐటీ, ఇరిగేషన్, టూరిజం మంత్రులుగా చూడటం ఏపీ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని పృథ్వీరాజ్ అన్నారు.


ఇవి కూడా చదవండి

YCP: బుగ్గన వర్గానికి మహిళల నుంచి ఊహించని పరిణామం..

Purandeswari: మే 13న జరిగే ఎన్నికలతో ఆ మార్పు వస్తుంది

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2024 | 05:20 PM

Advertising
Advertising