AP News: చంద్రబాబుతో నారాయణ భేటీ.. చర్చకొచ్చిన విషయాలివి !
ABN , Publish Date - Feb 27 , 2024 | 01:23 PM
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో మాజీ మంత్రి నారాయణ మంగళవారం భేటీ అయ్యారు. వచ్చే నెల 2న చంద్రబాబు నెల్లూరు పర్యటనపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో పదికి పది స్థానాలు గెలుస్తామని.. క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలే లేరన్నారు.

అమరావతి, ఫిబ్రవరి 27: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో (TDP Chief Chandrababu Naidu) మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) మంగళవారం భేటీ అయ్యారు. వచ్చే నెల 2న చంద్రబాబు నెల్లూరు పర్యటనపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో పదికి పది స్థానాలు గెలుస్తామని.. క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలే లేరన్నారు. వచ్చే నెల రెండో తేదీన జరిగే చంద్రబాబు టూర్లో వేమిరెడ్డి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. జనసేనతో సీట్ల సర్దుబాటు చంద్రబాబు, పవన్ చర్చించుకుంటున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారోననేది తమకు తెలీదన్నారు. సీట్ల విషయంలో చంద్రబాబు ఆదేశాలను పాటిస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీతో కూడా చర్చలు జరుగుతున్నాయని. త్వరలోనే చంద్రబాబు క్లారిటీ ఇస్తారని నారాయణ పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..