AP Pensions: పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం
ABN, Publish Date - Jul 01 , 2024 | 10:15 AM
Andhrapradesh: ఏపీలో ఊరూవాడా పెన్షన్ల పంపిణీతో ఓవైపు పండగ వాతావరణం నెలకొంటే.. మరోవైపు పెన్షన్ల విషయంలో ఓ సచివాలయ ఉద్యోగి చేసిన నిర్వాకంతో అంతా అవాక్కవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
పల్నాడు, జూలై 1: ఏపీలో (Andhrapradesh) ఊరూవాడా పెన్షన్ల (AP Pensions) పంపిణీతో ఓవైపు పండగ వాతావరణం నెలకొంటే.. మరోవైపు పెన్షన్ల విషయంలో ఓ సచివాలయ ఉద్యోగి చేసిన నిర్వాకంతో అంతా అవాక్కవ్వాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉదయం నుంచి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు.
Chandrababu: ఎన్నికల హామీల అమలు దిశగా.. సాధ్యం కాదన్నా.. చేసి చూపించారు..!
అయితే పల్నాడు జిల్లాలో మాచర్లలో మాత్రం పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. మాచర్ల 9వ వార్డు సచివాలయం వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడావత్ వాలు నాయక్ పెన్షన్‌దారుల వద్ద నుంచి కమిషన్ పేరుతో రూ.500 మేరకు వసూలు చేశాడు. విషయం తెలిసిన మున్సిపల్ కమిషన్.. సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీలో కమీషన్ తీసుకున్నందుకు గాను వాలు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మాచర్ల మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి....
MLC Kavitha: కవితకు బెయిల్ వస్తుందా.. కాసేపట్లో తీర్పు..
Viral Video: జలపాతం చూసేందుకు వెళ్లి వరదలో కొట్టుకుపోయిన ఫ్యామిలీ
Read Latest AP News AND Telugu News
Updated Date - Jul 01 , 2024 | 10:24 AM