ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Palnadu: క్రోసూరులో యువకుడు హల్‌చల్.. బురఖా ధరించి ఏకంగా..

ABN, Publish Date - Oct 08 , 2024 | 02:56 PM

పల్నాడు జిల్లా క్రోసూరులో బురఖా ధరించిన యువకుడు స్థానిక ఆస్పత్రి వద్ద హల్‌చల్ చేశాడు. మహిళ వేషధారణలో వచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.

పల్నాడు: క్రోసూరులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. బురఖా ధరించి ప్రభుత్వ ఆస్పత్రిలోకి ప్రవేశించడం స్థానికంగా కలకలం రేపింది. బురఖా ధరించిన ఓ అగంతకుడు క్రోసూరు పీహెచ్‌సీ వద్దకు వచ్చాడు. అక్కడ్నుంచి మెల్లిగా లోపలికి ప్రవేశించి మీటింగ్ హాల్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, ఆస్పత్రి సిబ్బందికి అతని ప్రవర్తన వింతగా అనిపించింది. దీంతో అగంతకుడిని ఫాలో అయ్యారు. అతని నడక, వేషధారణ తేడాగా అనిపించడంతో పలకరించే ప్రయత్నం చేశారు. ఎవరు మీరు, మీటింగ్ హాల్‌లోకి ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.


ఆస్పత్రి సిబ్బంది, రోగుల బంధువులు అతణ్ని నిలువరించారు. అతను మాట్లాడకపోవడంతో కొందరు మహిళల చేత ముఖానికి ఉన్న వస్త్రాన్ని తొలగించారు. దీంతో అతను మగాడిగా తెలిపోయింది. వెంటనే అతని పారిపోకుండా పలువురు యువకులు గట్టిగా పట్టుకున్నారు. అనంతరం అందరూ కలిసి అతణ్ని ఆస్పత్రిలోని ఓ గదిలో పెట్టి గడియ పెట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అగంతకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ఎవరు, ఎందుకు బురఖా ధరించి ఆస్పత్రిలోకి వెళ్లాడు, ఎవరిపైనైనా దాడి చేసేందుకు కుట్ర పన్నాడా లేక మరేదైనా విషయం ఉందా అంటూ పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.


కలకలం రేపిన కిడ్నాప్..

మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి అపహరణకు గురైన నవజాత శిశువు కథ సుఖాంతం అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు రూరల్‌ మండలం గోరంట్లకు చెందిన షేక్‌ నసీమాకి అనే గర్భిణి జీజీహెచ్‌లో ప్రసవించింది. ఆమెకు పండంగి మగ బిడ్డ పుట్టాడు. అయితే అర్ధరాత్రి సమయంలో వారి వద్దకు వచ్చిన ఓ మహిళ మాటలు కలిపింది. తన భర్తకు ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో చేరినట్లు చెప్పింది. తాము పక్క గదిలోనే ఉంటున్నామని నమ్మించింది. మెల్లిగా ఆమె మాటలు నమ్మేలా చేసింది. అనంతరం తన భర్తకు చిన్నారిని చూపించి మళ్లీ తీసుకువస్తానని చెప్పి బాలింత వద్ద నుంచి బిడ్డను తీసుకెళ్లిపోయింది.


అనంతరం అటు నుంచి అటే వెళ్లిపోయింది. మరో ఇద్దరు యువకులు సైతం ఆమెతోపాటు ఆటోలో ఎక్కి వెళ్లిపోయారు. ఇది గమనించిన చిన్నారి కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రి సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితురాలు సత్తెనపల్లికి చెందిన శిరీషగా గుర్తించారు. మహిళతోపాటు ఆమెకు సహకరించిన ప్రేమరాజు అనే వ్యక్తిని పల్నాడు జిల్లా క్రోసూరులో పసికందుతో సహా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు తరలించారు. అయితే చిన్నారిని విక్రయించేందుకే అపహరించినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు అదృశ్యమైన రెండ్రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించడంపై పలువురు పోలీసులను అభినందిస్తున్నారు.

Updated Date - Oct 08 , 2024 | 02:56 PM