AAdireddy Srinivas:ఆదిరెడ్డి భవానిపై ట్రోల్స్..ఆదిరెడ్డి వాసు వార్నింగ్
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:04 PM
గత అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మద్యంతో కుటుంబాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయనే అంశంపై మాట్లాడిడే.. ఆమెపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేసిందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అప్పట్లో స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Meetings) కొనసాగుతున్నాయి. ఇవాళ(శనివారం) అయిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన మండలికి ఇవాళ సెలవు ప్రకటించారు. ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ 2024 -25 పై డిమాండ్స్, గ్రాంట్స్ పై పలు శాఖల మంత్రులు వివరణ ఇవ్వనున్నారు. జీరోఅవర్‌లో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్ శ్రీనివాసు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత అసెంబ్లీలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మద్యంతో కుటుంబాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయనే అంశంపై మాట్లాడారని చెప్పారు. ఆమెపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ అంశంపై అప్పట్లో స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. కనీసం అప్పటి స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని కూడా ఆయన అవమాన పరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు తమ కుటుంబంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడును ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. జగన్ ప్రభుత్వంలో దిశా చట్టం లేకుండా దిశా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారని అన్నారు. దిశా చట్టానికి నిధులు కేటాయించారని తెలిపారు. దీనిపై కూడా దర్యాప్తు జరపాలని ఆదిరెడ్డి వాసు స్పీకర్‌ను కోరారు.
Updated Date - Nov 16 , 2024 | 12:16 PM