ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సీఎం చంద్రబాబు రెండ్రోజుల ఢిల్లీ టూర్.. వివరాలు ఇవే..

ABN, Publish Date - Oct 06 , 2024 | 07:38 PM

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. ముందుగా సోమవారం సాయంత్రం 4:30గంటలకు ప్రధాని మోదీతో ఏపీ సీఎం సమావేశం అవుతారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు(సోమవారం) ఉదయం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈసారి రెండ్రోజులపాటు పర్యటన సాగనుంది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని మోదీ సహా పలువురు మంత్రుల దృష్టికి మరోసారి సీఎం తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి ఇవే అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా మరోసారి వెళ్లి వారి ముందు కీలక అంశాలపై ప్రతిపాదనలు పెట్టనున్నారు.


చర్చించే అంశాలు ఇవే..

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. ముందుగా సోమవారం సాయంత్రం 4:30గంటలకు ప్రధాని మోదీతో ఏపీ సీఎం సమావేశం అవుతారు. బుడమేరు వరదల అనంతరం చంద్రబాబు తొలిసారిగా ప్రధానిని కలుస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, నష్టంపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. వరద సహాయం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలను ప్రధాని ఎదుట చంద్రబాబు పెట్టనున్నారు.


అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తామన్న రూ.15వేల కోట్లపైనా చర్చించే అవకాశం ఉంది. నిధులు విడుదలకు ఎలాంటి ఆంటకం లేకుండా ఉండేలా చూడాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మెుదటి విడత కింద ఇస్తామన్న రూ.12వేల కోట్ల గురించీ సీఎం మాట్లాడే అవకాశం ఉంది. మోదీని కలిసిన రోజే రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన భేటీ అవుతారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన ముహూర్తం సహా రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైనా చర్చలు జరపబోతున్నారు. అలాగే మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అవుతారు. అదే రోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ కానున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం రేపు, ఎళ్లుండి రెండ్రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: పుంగనూరు బాలిక కుటుంబానికి చంద్రబాబు ఫోన్.. వారిని వదిలిపెట్టబోమని హామీ..

Chittoor: పుంగనూరు బాలిక హత్య కేసు.. ముగ్గురి అరెస్టు.. సంచలన విషయాలు వెల్లడి..

Vijayawada: తిరుమల లడ్డూ వివాదం ఎఫెక్ట్.. ఆ ఆలయంలో సరకులు వెనక్కి..

Updated Date - Oct 06 , 2024 | 08:03 PM