Big Breaking: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి బిగ్ రిలీఫ్.. కీలక తీర్పు ఇచ్చిన హైకోర్టు..
ABN, Publish Date - May 28 , 2024 | 01:27 PM
Bail to Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు(AP High Court) కీలక తీర్పునిచ్చింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేసింది హైకోర్టు. అయితే, పలు షరతులు విధించింది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ..
Bail to Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు(AP High Court) కీలక తీర్పునిచ్చింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేసింది హైకోర్టు. అయితే, పలు షరతులు విధించింది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. వచ్చే నెల 6వ తేదీ వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. అయితే, కొన్ని షరతులు విధించింది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రతి రోజూ ఎస్పీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 4వ తేదీన మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లవచ్చునని తెలిపింది. ఆ రోజున రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కావడంతోనే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. జూన్ 6వ తేదీన మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
Also Read: దేశం మొత్తం నిర్ఘాంత పోయేలా ఏపీ ఫలితాలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచెర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకం సృష్టించారు. ఎన్నికల పోలింగ్ సమయంలో పలు చోట్ల దాడులకు, విధ్వంసానికి పాల్పడ్డారు. పాల్వయ్ గేట్ గ్రామంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు.. టీడీపీ ఏజెంట్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు పిన్నెల్లి. ఈవీఎం ధ్వంసం వ్యవహారంలో పది సెక్షన్ల కింద కేసు నమోదవగా.. టీడీపీ ఏజెంట్‌పై దాడి, ఓ పోలీస్ అధికారిపై దాడి.. మరొకరిని బెదిరించిన నేపథ్యంలో హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో ఈ కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. పిన్నెల్లి పరార్ అయ్యారు.
Also Read: పిన్నెల్లిని కాపాడుతుంది తెలంగాణకు చెందిన ఆ నాయకుడేనా!?
ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఈ కేసులో జూన్ 6వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. తాజాగా హత్యాయత్నం కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోరగా.. కోర్టు అంగీకరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది ధర్మాసనం. దీంతో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల కేసులో పిన్నెల్లికి బిగ్ రిలీఫ్ దక్కినట్లయ్యింది.
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 28 , 2024 | 02:22 PM