Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బెయిల్‌పై తీర్పు రిజర్వ్..
ABN, Publish Date - May 27 , 2024 | 06:47 PM
హత్యాయత్నం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) బెయిల్ మంజూరు చేయడంపై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు(AP High Court). రెండు హత్యాయత్నం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి, మే 27: హత్యాయత్నం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) బెయిల్ మంజూరు చేయడంపై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు(AP High Court). రెండు హత్యాయత్నం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. తీర్పు ఆర్డర్స్ మంగళవారం నాడు ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు.. పాల్వాయ్ గేట్ గ్రామంలో వీవీప్యాట్ ధ్వంసం కేసు కూడా ఆయనపై నమోదైంది. ఈ కేసులో పిన్నెల్లిపై జూన్ 6వ తేదీ వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ కేసులో తీర్పు మంగళవారం నాడు వెలువడనుంది.
పోలీసులు అలర్ట్..
ఏపీలో పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ సందర్భంగా మళ్లీ గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడిపత్రి అల్లర్లపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. యాడికి, పెద్దవడగూరులో నిందితులపై రౌడీషీట్ నమోదు చేశారు. తాడిపత్రిలో 106, యాడికిలో 37, పెద్దవడగూరులో ఏడుగురిపై రౌడీషీట్ నమోదు చేశారు. మొత్తం 159 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు పోలీసులు.
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 27 , 2024 | 09:03 PM