Share News

Pinnelli Ramakrishna: మాచర్లలో హైటెన్షన్.. పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..

ABN , Publish Date - May 22 , 2024 | 12:39 PM

మాచర్ల ఎమ్మెల్యే(Macharla MLA) పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని(Pinnelli Ramakrishna Reddy) అరెస్ట్ చేస్తారా? పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారా? పరిస్థితి చూస్తుంటే పిన్నెల్లి అరెస్ట్(Pinnelli Ramakrishna Reddy Arrest) తప్పేలా లేదు. ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు పరిస్థితి కనిపిస్తోంది. పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను(EVM Damage) ధ్వంసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం..

Pinnelli Ramakrishna: మాచర్లలో హైటెన్షన్.. పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..
Pinnelli Ramakrishna

అమరావతి, మే 22: మాచర్ల ఎమ్మెల్యే(Macharla MLA) పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని(Pinnelli Ramakrishna Reddy) అరెస్ట్ చేస్తారా? పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారా? పరిస్థితి చూస్తుంటే పిన్నెల్లి అరెస్ట్(Pinnelli Ramakrishna Reddy Arrest) తప్పేలా లేదు. ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు పరిస్థితి కనిపిస్తోంది. పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను(EVM Damage) ధ్వంసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో పోలీసులు పరుగులు తీస్తున్నారు. వీరి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే, ఈ ప్రత్యేక బృందాల కదలికలపై కొందరు బానిస పోలీసులు పిన్నెల్లి బ్రదర్స్‌కు ఇప్పటికీ సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందం హైదరాబాద్ చేరుకుంది.


అసలేం జరిగిందంటే..

పాల్వయి గేట్ గ్రామంలో పోలింగ్ బూత్‌లో ఈవీఎం ద్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో తక్షణమే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం గాలిస్తున్నాయి. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలాఉంటే.. ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై రెండు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉండటంతో పోలీస్ వర్గాలు సతమతం అవుతున్నాయి. అదనపు సెక్షన్లు కూడా పెట్టేందుకు కోర్టులో మెమో వేయాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, పోలీసులు మాత్రం దీనిని నిర్ధారించలేదు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 22 , 2024 | 12:39 PM