ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రాక ముందే ఆ పని చేయండి: వైఎస్ షర్మిల

ABN, Publish Date - Nov 16 , 2024 | 03:44 PM

జీవో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందంటూ ఆమె చంద్రబాబుకు తెలిపారు.

APPC Chief YS Sharmila Reddy

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల ఎంపికలో 1:100 విధానం అనుసరించాల్సిందే అంటూ ఏపీ సీఎం చంద్రబాబుని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్ 2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్నే గ్రూప్-1 విషయంలోనూ పాటించాలని షర్మిల కోరారు. ఇదే విషయమై కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని ఆమె వెల్లడించారు. గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థుల ఎంపికపై షర్మిల మరోసారి సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

CM Chandrababu: సరికొత్త నినాదం ఇచ్చిన సీఎం చంద్రబాబు..


జీవో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని వైఎస్ షర్మిల చెప్పారు. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందంటూ ఆమె చంద్రబాబుకు తెలిపారు. 89 పోస్టులకు మీరిచ్చిన 1:50 రేషియో ద్వారా 4,450 మంది మాత్రమే మెయిన్స్‌కి అర్హత పొందారని, 1:100 రేషియో లెక్కన పిలిస్తే మరో 4,450 మందికి అవకాశం దక్కుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అలా ఎంపిక చేయాలని అభ్యర్థులు ఆశ పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

AP: క్షుద్ర పూజల కలకలం.. పోలీసుల అదుపులో వైసీపీ నేత..


గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహించడం వంటి కారణాలతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని షర్మిల తెలిపారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ -1 ఉద్యోగాలు పోతే ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని వారంతా ఆందోళనలో ఉన్నారని సీఎం చంద్రబాబు దృష్టికి షర్మిల తీసుకొచ్చారు. ఈ విషయంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ని కలిసి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదంటూ ఆమె మండిపడ్డారు. గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించి, న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు ఏపీసీసీ షర్మిల తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Nara Rammurthy naidu: రామ్మూర్తి నాయుడు మృతిపై ప్రముఖుల సంతాపం

Gv Anjaneyulu: జగన్‌కు ప్యాలెస్‌లు.. పేదలకు టిడ్కో ఇల్లు వద్దా.. జీవీ ఆంజనేయులు ధ్వజం

Updated Date - Nov 16 , 2024 | 03:47 PM