ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime News: యువతి హత్యాచారం కేసును 48గంటల్లో ఛేదించిన బాపట్ల పోలీసులు..

ABN, Publish Date - Jun 22 , 2024 | 09:11 PM

చీరాల మండలం ఈపూరుపాలెం (Epurupalem)లో యువతిపై హత్యాచారం జరిగిన 48గంటల్లోనే బాపట్ల పోలీసులు(Bapatla police) కేసును చేధించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితులను అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్‌ కారంకి మహేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

బాపట్ల: చీరాల మండలం ఈపూరుపాలెం(Epurupalem)లో యువతిపై హత్యాచారం జరిగిన 48గంటల్లోనే బాపట్ల పోలీసులు (Bapatla police) కేసును చేధించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), హోం మంత్రి అనిత ఆదేశాల మేరకు విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. నిందితులను అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్‌ కారంకి మహేశ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన యువతిపై గంజాయి మత్తులో ఉన్న దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


అసలేం జరిగిందంటే?

ఈపురుపాలెం గ్రామానికి చెందిన యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే టైలరింగ్ చేస్తోంది. శుక్రవారం తెల్లవారు జామున 5:30గంటల సమయంలో యువతి బహిర్భూమికి వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించారు. గ్రామంలోని బాలికల ఉన్నత పాఠశాల గోడ పక్కన పొదల్లో యువతి వివస్త్రగా మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. ముక్కు నుంచి రక్తం కారుతూ.. ఒంటి నిండ తీవ్రగాయాలు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేసి హత్య చేసినట్లు టీవీల్లో ప్రసారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

AP Fiber Net: ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు ఇంకా జగన్ మత్తు వీడలేదా?


ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..

సీఎం చంద్రబాబుకు విషయం తెలియడంతో ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని వెంటనే హోం మంత్రి అనితను ఆదేశించారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోం మంత్రి.. యువతి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం ఆదేశాలతో ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షించారు. ఐదు ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు అదే గ్రామానికి చెందిన రౌడీషీటర్లు దేవరకొండ విజయ్, దేవరకొండ శ్రీకాంత్, వారికి సహకరించిన కారంకి మహేశ్‌గా గుర్తించి వెంటనే వారిని అరెస్టు చేశారు. నేర ప్రవృత్తి కలిగిన నిందితులు గంజాయి మత్తులో యువతిపై హత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

రెచ్చిపోయిన మాజీ ఎంపీ ఆదాల అనుచరులు..

AP Fiber Net: ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు ఇంకా జగన్ మత్తు వీడలేదా?

Updated Date - Jun 22 , 2024 | 09:17 PM

Advertising
Advertising