ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఎంపీలతో చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక విషయాలివే..!

ABN, Publish Date - Jul 20 , 2024 | 03:24 PM

తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉడవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ ఈ భేటీకి ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు.

CM Nara Chandrababu Naidu

అమరావతి: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈరోజు (శనివారం) భేటీ అయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉడవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ ఈ భేటీకి ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


ALSO Read:TTD EO: తిరుమల ప్రక్షాళానికి శ్రీకారం...

కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖలు చొప్పున బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. నేటి సమావేశంలో మంత్రులను కూడా ఎంపీలకు సీఎం జతచేయనున్నారు.


ALSO Read: CM Revanth: ఆ ప్రక్రియను డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తాం

పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల సాధనపై చర్చించారు. జలజీవన్‌ మిషన్, క్రిషి సించాయీ యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయంపై మాట్లాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్‌ అంశాల పరిష్కారంపై చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై చంద్రబాబు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Ravi Kumar: ఏపీ విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష..

Nimmala: చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం

Nagababu: జగన్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2024 | 04:06 PM

Advertising
Advertising
<