ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: టీడీపీలో రెట్టించిన ఉత్సాహం.. పార్టీ కేడర్‌కు చంద్రబాబు అభినందనలు

ABN, Publish Date - Nov 27 , 2024 | 07:11 PM

టీడీపీ బలోపేతానికి అన్ని ఆర్గనైజేషన్లలో పార్టీ నాయకత్వాన్ని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు.

అమరావతి: జగన్ ప్రభుత్వ అరాచక పాలనలో టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో ఇవాళ(బుధవారం) చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదులో మొదటి పది స్థానాల్లో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నేతలను అభినందించారు. అనతికాలంలోనే 52 లక్షల సభ్యత్వాలకు చేర్చడంపై ప్రత్యేకంగా మంత్రి లోకేష్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.


నామినేటెడ్ పదవులు ఇచ్చాం..

‘‘అన్ని విధాలా దెబ్బతిన్న ఏపీని గాడిన పెడుతూనే టీడీపీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. సరైన మనిషి...సరైన చోట ఉంచుతామన్న మాటకు కట్టుబడి పార్టీ కోసం శ్రమించిన వారిని పదవుల్లో నియమిస్తున్నాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు కష్టపడి పని చేశారు. అయినా భయపడకుండా పోరాటం చేయడం వల్ల 57 శాతం ఓట్లతో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి విజయం సాధించింది. ఓడిపోయిన 11 సీట్లు కూడా అతి తక్కువ మెజారిటీతోనే. కొత్తగా పొలిటికల్ గవర్నెన్స్ విధానం తీసుకొచ్చాం. పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేసి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. కొద్ది రోజుల్లోనే సాగునీటి సంఘాలు, కో-ఆపరేటివ్ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించేలా పని చేయాలి’’ అని సీఎం చంద్రబాబు సూచించారు.


పార్టీ సభ్యత్వలో ఇదొక చరిత్ర..

‘‘పార్టీ సభ్యత్వాన్ని గత నెల 26న ప్రారంభించాం... ఇప్పటికి 52.45 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్నారు. ఇదొక చరిత్ర. రాజంపేట, కుప్పం, కళ్యాణదుర్గం, పాలకొల్లు, ఆత్మకూరు, మంగళగిరి, కనిగిరి, కోడూరు, వినుకొండ, కావలి నియోజకవర్గాలు టాప్ 10లో ఉన్నాయి. అక్కడి నాయత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సభ్యత్వాల నమోదుపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని లక్ష్యం దిశగా తీసుకెళ్తున్న మంత్రి లోకేష్‌ను అభినందిస్తున్నా. రోజుకు వేలాదిగా సభ్యత్వాలు నమోదువుతున్నాయి. తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు వేగం పుంచుకుంటోంది. రూ. లక్షతో శాశ్వత సభ్యత్వ విధానం మొదటిసారి తెచ్చాం. దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస్తోంది. శాశ్వత సభ్యత్వ రుసుం ద్వారా వచ్చే వాటితో నిరుపేద కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం. గతంలో రూ.100లతో రూ.2 లక్షలు బీమా ఉండేది... ఇప్పుడు దాన్ని రూ.5 లక్షలకు పెంచాం. రాబోయే రోజుల్లో కార్యకర్తలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొస్తాం’’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.


వారికి చట్టపరంగా శిక్షపడేలా చేస్తాం..

‘‘ఐదేళ్లలో పార్టీ కేడర్ కు రూ.140 కోట్లు బీమా, ఆరోగ్యం, విద్య కోసం సాయం అందించాం. టీడీపీ బలోపేతానికి అన్ని ఆర్గనైజేషన్లలో పార్టీ నాయకత్వాన్ని నియమిస్తాం. రోడ్ల మరమ్మతులకు రూ.14 వందల కోట్లు మంజూరు చేశాం. సంక్రాంతి నాటికి ఏపీలో ఎక్కడా రోడ్లపై గుంతల్లేకుండా చేస్తాం. యువతకు ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మనం చేసే రాజకీయం కేవలం ప్రజల కోసమే. ప్రజలను చైతన్యవంతం చేస్తూ మనం చేస్తున్న మంచి కార్యక్రమాలను వివరించాలి. ఇది సంక్షేమానికి పెద్ద పీట వేసే ప్రభుత్వం. అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తున్నాం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షపడేలా చేస్తాం. గత ఐదేళ్లు విచ్చలవిడితనంతో ఎక్కడికక్కడ భూ సమస్యలు సృష్టించారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరిస్తాం’’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Updated Date - Nov 27 , 2024 | 07:20 PM