ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: క్రైమ్ కంట్రోల్ చేయాలి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN, Publish Date - Aug 05 , 2024 | 09:39 PM

అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్దంగా లేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను.. డ్రోన్లను వినియోగించుకోవాలని సూచించారు.

CM Nara Chandrababu Naidu

అమరావతి: అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్దంగా లేనని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను.. డ్రోన్లను వినియోగించుకోవాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించుకుని నేరస్తులను పట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. సోమవారం నాడు ఏపీ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు సూచనలు, సలహాలు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించుకోలేదని అన్నారు. కేసులు పెట్టడానికి.. వేధించడానికి గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుకుందని ఆరోపించారు. నిన్న ఒక్క రోజే 5 వేల అర్జీలు వయని.. వచ్చిన వాటిల్లో 50 శాతం భూ సమస్యల పైనే వచ్చాయని వెల్లడించారు. భూ సమస్యల విషయంలో ప్రజల్లో చాలా అన్‌రెస్ట్‌ ఉన్నారన్నారు.


మదనపల్లె ఫైల్స్‌ ఘటన ఓ కేస్‌ స్టడీ ఉదాహరణగా చెప్పారు. మదనపల్లె ఘటన జరిగితే హెలీకాప్టర్ ఇచ్చి డీజీని.. సీఐడీ చీఫ్‌ను పంపించినట్లు తెలిపారు. 22-A పేరుతో భూ సమస్యలు సృష్టించారని విమర్శించారు. కంప్యూటర్‌లో చిన్నపాటి మార్పు చేసి.. భూములను కాజేశారని విమర్శించారు. భూమి ఉంటే సామాన్యునికి ఓ భరోసా ఉంటుందని తెలిపారు. దాన్ని కబ్జా చేయడంతో ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూములను ఫ్రీ హోల్డ్‌ చేసి.. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.


  • శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్

  • భూ బాగోతాలను ఎస్టాబ్లిష్ చేయాలి.. పేదలకు న్యాయం చేయాలి.

  • నేరాలను చేయడం.. వాటిని కప్పి పుచ్చుకోవడం కొందరికి అలవాటుగా మారింది.

  • వివేకా హత్యను గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చారు.

  • వివేకా హత్యపై ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ కావాలని.. అధికారంలోకి రాగానే సీబీఐ అవసరం లేదన్నారు.

  • తప్పు వాళ్లు చేసి.. నారాసుర రక్త చరిత్ర అంటూ నా మీద ఆరోపణలు చేశారు.

  • 36 మందిని రాజకీయ హత్యలు చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

  • తప్పుడు ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటున్నా.

  • ఐదేళ్లల్లో చేసిన తప్పును వెలికి తీసి శిక్షిస్తాం.. ఇప్పుడు ఎవరు తప్పులు చేసినా ఊరుకోను.

  • గంజాయి సేవించి ఆడవాళ్ల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.. దీన్ని కంట్రోల్ చేయాలి.

  • ప్రజలు గత ఐదేళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారు.. వాళ్లకు ప్రశాంత జీవితం ఇవ్వాలి.

  • శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలి.

  • రౌడీయిజం చూశా.. నక్సలిజం చూశా.. ఫ్యాక్షనిజం చూశా.. నాకేం భయం లేదు.

  • గంజాయి మత్తులో క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారు.. దీన్ని కంట్రోల్ చేయాలి.

  • చిన్న సంఘటననూ నిర్లక్ష్యం చేయొద్దు.

  • లిక్కర్ పాలసీపై అధ్యయనం చేస్తున్నాం.

  • అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లను ఏపీలోకి అనుమతిస్తున్నాం.

  • అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తే.. మద్యం అక్రమ రవాణ తగ్గుతుంది.

  • ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్‌ తెస్తున్నాం.

  • ప్రభుత్వంపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి.

  • 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం.. జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ తేవాలి.

  • రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయి.

  • రూ. 1.17 లక్షల కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరపాలి.

  • కొంత మేర ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది.

  • సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది.

  • సంపద సృష్టి జరగాలంటే శాంతి భద్రతల నిర్వహణ సరిగా ఉండాలి.

  • వివిధ అంశాలపై త్వరలో పాలసీలు తెస్తున్నాం.

  • విజిబుల్ పోలీసింగ్.. ఇన్‌ విజుబుల్‌ పోలీస్‌ అనే విధానం ఉండాలి.

  • అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

  • గంజాయి నివారణపై ప్రత్యేకంగా చర్చ జరగాలి.

  • నియోజకవర్గ స్థాయిలో గంజాయి నివారణ మీద సమీక్షలు చేపట్టాలని మంత్రి నాదెండ్ల సూచించారు.

  • ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డీజీపీ చంద్రబాబు సూచించారు.

  • గంజాయి విషయంలో హాట్ స్పాట్స్‌ ఆఫ్‌ ప్రొడెక్షన్‌.. హాట్‌ స్పాట్స్‌ ఆఫ్‌ కన్సప్షన్‌ అనేది ఐడెంటిఫై చేయాలి.

  • గంజాయి నెట్‌ వర్క్‌ను డిస్‌ కనెక్ట్‌ చేయాలి.

  • ముందుగా గంజాయి సాగు జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. పక్క రాష్ట్రం నుంచి గంజాయి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

  • సైబర్‌ సెక్యూరిటీ విషయంలో పటిష్టంగా చర్యలు తీసుకోవాలి.

  • సైబర్‌ క్రైమ్‌ విషయంలో ప్రజలను చైతన్యపర్చాలి.

  • ప్రతి జిల్లాకూ చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి రూ. 5 కోట్లను కేటాయిస్తాం

Updated Date - Aug 05 , 2024 | 09:42 PM

Advertising
Advertising
<