ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP-Janasena First List: విద్యావంతులకే పెద్దపీఠ.. నేతల విద్యార్హతలివే..!

ABN, Publish Date - Feb 24 , 2024 | 04:07 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన(TDP-Janasena) పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీల్లోని నేతలు పలు ప్రణాళికలను రచిస్తున్నారు. అధికార వైసీపీ(YSRCP)ను ఢీకొట్టడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి.

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన(TDP-Janasena) పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీల్లోని నేతలు పలు ప్రణాళికలను రచిస్తున్నారు. అధికార వైసీపీ(YSRCP)ను ఢీకొట్టడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ ప్లాన్‌లో భాగంగా అత్యంత ప్రజాధారణ కలిగిన అభ్యర్థులను బరిలోకి దింపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే శనివారం నాడు తొలి జాబితాను విడుదల చేసినట్లు కనిపిస్తోంది.

కాగా ఈ జాబితాలో 99 మంది విద్యావంతులు కావడం గమనార్హం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనున్న రామాంజనేయులు ఐఏఎస్ కాగా, ముగ్గురు ఎంబీబీఎస్‌ చదివిన వైద్యులు, ఇద్దరు పీహెచ్‌డీ చేసిన డాక్టరేట్లు ఉన్నారు. మిగిలిన 93 మంది అభ్యర్థుల్లో 30 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మొత్తం 99 మందిలో 13 మంది మహిళలకు చోటు దక్కింది. వయసు రీత్యా చూస్తే 45 ఏళ్లలోపు పోటీ చేసేవారు 24 మంది ఉండగా.. 46 నుంచి 60 ఏళ్లలోపు వారు 55, 61 నుంచి 70 ఏళ్ల లోపు వారు 20 మంది ఉన్నారు. దాదాపు కోటి 3 లక్షల మంది నుంచి అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ - జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో యువత, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 24 , 2024 | 04:13 PM

Advertising
Advertising