ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: వారికి దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత.. ఇక నుంచి రాష్ట్రంలో దూసుకెళ్లాలన్న జగన్..

ABN, Publish Date - Oct 02 , 2024 | 04:14 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు.

అమరావతి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ అనుబంధ సంఘాలతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి అనుబంధ సంఘాల నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని వారిని ఆదేశించారు. వైసీపీ అనుబంధ నూతన సంఘాలు, వాటి జిల్లా అధ్యక్షులను ఇటీవల వైసీపీ అధినేత నియమించారు. ఈ మేరకు రానున్న రోజుల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పార్టీ బలపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాలు ఇకపైన యాక్టివ్ పనిచేయాలని జగన్ ఆదేశించారు.


పథకాలు అటకెక్కాయి..

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.." ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన 4 నెలల్లోనే వారిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవెనూ లేదు. స్కూల్స్‌ పోయాయి, చదువులు పోయాయి. విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి అటకెక్కాయి. ఆస్పత్రుల అభివృద్ధి, ఆరోగ్యశ్రీ, రేషన్ డోర్‌ డెలివరీ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా పోయింది. వ్యవసాయం సహా అన్ని రంగాల్లో పరిపాలన కుప్పకూలింది. విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో చెందుతోంది. సీఎం చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఏపీలో రెడ్‌ బుక్‌ పరిపాలన కొనసాగుతోంది. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. లా అండ్‌ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదు. పారదర్శకత అన్నది ఎక్కడా లేదు. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం. ఎన్యుమరేషన్‌ను సరిగ్గా చేయలేకపోయారు. కలెక్టర్ల కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తమకు నచ్చిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు.


దేవుడికే కోపం తెప్పిస్తున్నారు..

వైసీపీ బాగుంటేనే మనమంతా బాగుంటాం. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత. నేను కేవలం మీ అందరి ప్రతినిధిని మాత్రమే. వైసీపీ మనందరిదీ అన్న విషయాన్ని గుర్తించుకోండి. పార్టీ కోసం కష్డపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికీ పూర్తిగా అండగా ఉంటాం. వారికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. క్షేత్రస్థాయి నుంచి వైసీపీని మరింత బలోపేతం చేద్దాం. దేశంలో అత్యంత బలమైన పార్టీగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మనకు లక్షల మంది కార్యకర్తలు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఏపీలో పరిపాలన ఘోరంగా ఉంది. అందుకనే ప్రజల్ని డైవర్ట్‌ చేయడానికి కొత్త టాపిక్స్ తెరమీదకి తెస్తున్నారు. ఆ కొత్త టాపిక్స్‌ ఏంటో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ల పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు మొదలుపెట్టా. గ్రామాల వరకూ అనుబంధ విభాగాల నిర్మాణం జరగాలి. పార్టీ పిలుపు ఇస్తే పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకూ కదలిక రావాలి. ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలి" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

CM Chandrababu: చెత్త పన్నుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

YS Sharmila: లడ్డూ వివాదానికి మతం రంగు పూయడం సరికాదు

Pawan Kalyan: శ్రీవారి పాదాల చెంత వారాహి డిక్లరేషన్ బుక్.. మీడియాకు ప్రత్యేకంగా చూపించిన పవన్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2024 | 04:16 PM