ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS:అదానీ స్కాంలో.. జగన్‌పై గోనే ప్రకాశరావు సంచలన ఆరోపణలు

ABN, Publish Date - Nov 25 , 2024 | 03:27 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు తొట్టి గ్యాంగ్ బ్యాచ్‌తో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసి ప్రజ‌ల‌ను మ‌భ్య పెట్టాల‌ని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చూశారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాశ రావు విమర్శించారు .

అమరావతి: అదానీ స్కాంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డికు వాటా ఉందని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాశరావు సంచలన ఆరోపణలు చేశారు. అదానికి వచ్చిన డబ్బుతో అన్నీ రాష్ట్రాల సీఎంలకు కమిషన్ ఇచ్చారని ఆరోపించారు. ఈా సందర్భంగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డికి సవాల్ విసిరారు. ద‌మ్ముంటే డిబేట్‌కు రావాల‌ని ఆయన సవాల్ విసిరారు. ఇవాళ(సోమవారం) గోనే ప్రకాశరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... గౌతమ్ అదానీ, వైఎస్ జగ‌న్‌పై గోనే ప్రకాశరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


అదానీ ఎలా ఎదిగాడో దేశ ప్రజ‌లందరికీ తెలుసునని చెప్పారు. అదానీ షేర్ల ద్వారా వచ్చిన డబ్బులో 4 రాష్ట్రాల్లో సీఎంలకు డబ్బులు ఇచ్చారనీ ఆరోపించారు. జగన్‌కి రూ. 1750 కోట్లు ఇచ్చారని మీడియాలో వచ్చాయని చెప్పారు. అమెరికా చట్టం ప్రకారం కచ్చితంగా జగన్‌పై కేసు నమోదైతే ఆ దేశానికి వెళ్ళాల్సి ఉంటుందని గోనే ప్రకాశ రావు తెలిపారు.


అదానీ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకునే పరిస్థితి లేదని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అదానీ స్కాంలో జగన్‌కి కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని తెలిపారు. FBI (ఫెడరేల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ )తో అదానీపై ఇన్వెస్టిగేషన్ చేయాలని గోనే ప్రకాశ రావు డిమాండ్ చేశారు.


ఐ డ్రీమ్ జగన్ జేబు సంస్థ అని విమర్శించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు తొట్టి గ్యాంగ్ బ్యాచ్‌తో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసి ప్రజ‌ల‌ను మ‌భ్య పెట్టాల‌ని చూశారని విమర్శించారు . జగన్‌కు ఏ కోణంలో ప్రతిపక్ష హోదా వస్తుందో వైసీపీ చెప్పాలని నిలదీశారు. భారతదేశంలో 9 రాష్ట్రాల్లో ఎవరికీ ప్రతీపక్ష హోదా లేదని అన్నారు. చ‌దువుకున్న జగన్ ప్రతిప‌క్ష హోదా అడ‌గ‌టానికి సిగ్గు లేదా అని విమర్శించారు. అదానీని మోదీ కూడా వదులుకునే పరిస్థితి వస్తుందని చెప్పారు. అమ్మను, చెల్లిని మోసం చేసిన‌ నీచ చరిత్ర జ‌గ‌న్‌ది అని గోనే ప్రకాశరావు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కేసు విచారణ...

బీఆర్ఎస్ మహాధర్నా.. ముఖ్య అతిథిగా కేటీఆర్..

ఆ భేటీల మర్మమేమి...

అబద్ధాల్లో తగ్గేదేలే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 25 , 2024 | 03:53 PM