AP Project : మరో భారీ ప్రాజెక్ట్‌కు ఏపీ ప్రభుత్వం రూపకల్పన
ABN, Publish Date - Dec 30 , 2024 | 06:12 PM
CM Chandrababu: మరో భారీ ప్రాజెక్ట్‌కు ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశ, విదేశీ కంపెనీలు సైతం క్యూ కట్టాయి. అందులోభాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఏపీలో ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.
అమరావతి : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీలో పలు ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీకి మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. పెట్టుబడులు ఏపీకి రావడం వల్ల 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి క్లీన్ ఎనర్జీ పాలసీతో ఏపీకి పలు సంస్థలు క్యూ కడుతన్నాయి. SIPB సమావేశంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీవైపు పయనిస్తుందని తెలిపారు. ఏపీ ఆ దిశగా ఆలోచనలు చేయాల్సి ఉందన్నారు. యూనిట్ విద్యుత్ ధర రూ.5.18 నుంచి రూ.4.80కు తగ్గించడం లక్ష్యమని చెప్పారు. యూనిట్ విద్యుత్ ధర తగ్గించేందుకు వినూత్న యోచనలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో విద్యుత్ రంగంలో వినూత్న మార్పు చూస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ప్రజాభిప్రాయానికి తగ్గట్టే పాలన ఉంటుందని తెలిపారు. అధికారులు తమ పనితీరుతో ప్రజలను మెప్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
కాగా.. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశ, విదేశీ కంపెనీలు సైతం క్యూ కట్టాయి. అందులోభాగంగా ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి లూలు సంస్థ వెళ్లి పోయింది. ఆ సంస్థ సైతం మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఇవేగాకుండా టాటా సంస్థతోపాటు పలు ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఏపీలో తన సంస్థలను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి వచ్చింది లేదు. అలాగే లూలూ సంస్థ కూడా ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయింది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో.. ఉపాధి కోసం యువత దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్లారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించారు. అందుకే.. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటుకు దేశవిదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Perni Nani: పేర్ని నాని ఫ్యామిలీకి మళ్లీ నోటీసులు
CP Rajasekhar: వార్షిక నేర సమీక్షను విడుదల చేసిన విజయవాడ సీపీ.. ఏం చెప్పారంటే
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 30 , 2024 | 06:19 PM