ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Nadendla: పవన్ వ్యాఖ్యలు వైరల్.. స్పందించిన మంత్రి నాదెండ్ల

ABN, Publish Date - Aug 08 , 2024 | 06:30 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బెంగళూరు పర్యటనలో బిజీగా ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా అడవుల పరిరక్షణలో భాగంగా సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు.

Nadendla Manohar

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బెంగళూరు పర్యటనలో బిజీగా ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా అడవుల పరిరక్షణలో భాగంగా సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు. 40 సంవత్సరాల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడే వాడని, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం సినిమా పరిస్థితి అని పవన్ అభివర్ణించారు.


వ్యక్తిగతంగా విమర్శించలేదు..

అయితే, పవన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పందించారు. ‘‘పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించరు. పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు పెంచాలనే ప్రత్యేక కార్యాచరణతోనే అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు’’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగా కుటుంబానికి చెందిన ఓ నటుడి గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


అటవీ సంరక్షణపై పవన్ చర్చ..

కాగా, ఇవాళ (గురువారం) బెంగళూరు నగరంలో కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే‌తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వంతో వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు పవన్ కర్ణాటక వెళ్లారు. కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సుధీంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం, తదితరులు ఆహ్వానం పలికారు. ఇక పర్యటనలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో కూడా పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.


పవన్ కర్ణాటక ఎందుకు వెళ్లారంటే..?

అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పరిధిలో, పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు ఊళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. అంతేకాదు ప్రాణ హాని కూడా కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమవుతాయి. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉండటంతో కొన్ని కుంకీ ఏనుగులు ఏపీకి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖతో చర్చలు జరిపేందుకు పవన్ కర్ణాటక వెళ్లారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రే‌తో చర్చలు జరిపారు.

Updated Date - Aug 08 , 2024 | 07:03 PM

Advertising
Advertising
<