Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 02 , 2024 | 12:05 PM
బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం ఆలోచిస్తుంటే... వైసీపీమాత్రం జీవితకాలం అధ్యక్షుడిని తానేనని విస్తృత స్థాయి సమావేశంలో పెట్టుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 1వ తేదీన కాకపోవచ్చు అని మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఇవాళ(శనివారం) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఉద్ఘాటించారు. కుటుంబ సభ్యులకు కాకుండా వేరే సామాజిక వర్గానికి చెందిన వారిని టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మంత్రి కొలుసు పార్థసారథి కొనియాడారు.
బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంటే... వైసీపీ మాత్రం జీవితకాలం అధ్యక్షుడిని తానేనని విస్తృత స్థాయి సమావేశంలో పెట్టుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం దూర దృష్టితో ఆలోచిస్తారని తెలిపారు. గతంలో ఎక్కడ చూసినా అసభ్యంగా మాట్లాడే వైసీపీ నేతలను చూసేవాళ్లమని.. నాలుగు నెలల నుంచి అటువంటివి ఏమీ లేవని చెప్పారు. ఏపీ అభివృద్ధి గురించి ఖూనీకోరులు కూడా మాట్లాడటం దెయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శలు చేశారు.
పొట్టి శ్రీరాములుకు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా గౌరవం ఇచ్చింది అనేది అందరికీ తెలుసునని విమర్శించారు. పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కూడా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన నిర్వహించాలా లేదా పొట్టి శ్రీరాములు వీరమరణం పొందిన అక్టోబర్ 1వ తేదీన జరపలా అన్న అంశంపై ఆలోచన చేస్తున్నామని అన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు.
నెల్లూరులోని పొట్టి శ్రీరాములు నివాసాన్ని మ్యూజియంగా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ... టీడీపీలో సభ్యత్వం తీసుకోవడం అంటే అదొక గర్వకారణంగా ఉంటుందని నారాయణ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే బలుగు బలహీన వర్గాలకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
పశ్చిమగోదావరి: వైసీపీ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసిందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. భీమవరంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాళ(శనివారం) పర్యటించారు. ఇన్‌చార్జి మంత్రి హోదాలో తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లాలో గొట్టిపాటి పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమావేశం కానున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ... భీమవరంలో మిషన్ హార్ట్ టోల్ ఫ్రీ ఏ.పీ (గుంతలు లేని రోడ్లు సాధనగా ప్రభుత్వం ముందడుగు )కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.826 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు.కూటమి నాయకులతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ఈ ఐదేళ్లు ఒక ఛాలెంజ్: యనమల రామకృష్ణుడు
గవర్నమెంట్ విజన్ 2047 అప్పులు, డెఫిసిట్స్ నుంచి బయటపడే విధంగా ఉండాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాబోయే సంవత్సరాల్లో మిగులు రాష్ట్రంగా ఏపీ ఉండాలని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ఈ ఐదేళ్లు ఒక ఛాలెంజ్ అని చెప్పారు. గవర్నమెంట్ ఆదాయం పెరిగే విధంగా ఉండాలని మరియు దుబార ఖర్చులు అరికట్టాలని అన్నారు. అవసరమైతే వీలైనంత వరకు రెవెన్యూ ఖర్చు తగ్గించి క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్ పెంచాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం తప్పిదాల వల్ల ఇప్పటి పరిస్థితి చూస్తే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు జీఎస్డీపీ(GSDP )లో 9వ స్థానంలో ఉందని యనమల రామకృష్ణుడు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Karthika masam: కార్తీక వైభవం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు ...
MLC Election:విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
YSRCP: లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 02 , 2024 | 12:16 PM