ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP Leader Lanka Dinakar: చంద్రబాబు ప్రకటించారు.. మోదీ సహకరించారు..

ABN, Publish Date - Aug 30 , 2024 | 01:18 PM

వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఏపీ బీజీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

AP BJP Spokesperson Lanka Dinakar

అమరావతి: వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఏపీ బీజీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ లైఫ్ లైన్ పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసేందుకు రూ.12,157కోట్ల నిధులు మంజూరు చేశారని, అందుకు ఏపీ ప్రజల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్తున్నట్లు లంకా దినకర్ చెప్పారు.


ఇండస్ట్రియల్‌ కారిడార్లు రాయలసీమకు వరం..

కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ కారిడార్లకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై బీజేపీ నేత లంకా దినకర్ హర్షం వ్యక్తం చేశారు. ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో రూ.2,786కోట్లతో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. దీని ద్వారా రూ.12వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 45వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని దినకర్ చెప్పుకొచ్చారు. 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేయడాన్ని లంకా దినకర్ అభినందించారు. దీనికి గానూ రూ.2,137 కోట్లు కేంద్ర ఇవ్వడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కొప్పర్తి పారిశ్రామిక హబ్ ద్వారా 54 వేల మంది ఉపాధి పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలో లక్ష మంది యువత ఉద్యోగాలు పొందనున్నట్లు లంకా దినకర్ పేర్కొన్నారు.


చంద్రబాబుకు మోదీ సహకారం..

ఏపీ ఆత్మగౌరవ ప్రతీక అమరావతి నిర్మాణానికి బహుళపక్ష ఏజెన్సీల ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.15వేల కోట్లు సమకూర్చడంతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయని లంకా దినకర్ తెలిపారు. ఐదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని అమరావతికి మంచి రోజులు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రకటిస్తే, దాన్ని వాస్తవం చేయడానికి పీఎం మోదీ సహకరిస్తున్నారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో తెచ్చిన రివర్స్‌ టెండర్ల ప్రక్రియ వల్ల అనేక ప్రాజెక్టుల్లో జాప్యం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ దెబ్బతిని కేంద్ర ప్రభుత్వంపై వెయ్యి కోట్ల అదనపు భారం పడినట్లు బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి..

Actress Jithwani: ముంబై నటి స్టేట్‌మెంట్ రికార్డు.. కన్నీరు పెట్టుకున్న జిత్వానీ

AP Govt: ఒకే కాంట్రాక్టర్‌కు రూ.64 కోట్ల చెల్లింపులు... ఆర్థిక శాఖలో బయటపడుతున్న వాస్తవాలు

Budda Venkanna: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం

Updated Date - Aug 30 , 2024 | 01:18 PM

Advertising
Advertising