Minister Anam: అర్చకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..
ABN, Publish Date - Nov 05 , 2024 | 08:46 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీ మేరకు వారి వేతనాలను రూ.15వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP government) దేవాలయాల అర్చకులకు తీపి కబురు చెప్పింది. అర్చకుల వేతనం పెంచుతూ చంద్రబాబు (CM Chandrababu) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రూ.50 వేలకు మించి ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకుల కనీస వేతనం రూ.15 వేలకు పెంచుతున్నట్లు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల హామీ మేరకు పేద బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
దీని వల్ల మెుత్తం లబ్ధిదారుల సంఖ్య 3,203కు చేరుతుందని మంత్రి ఆనం తెలిపారు. వేతనాలు పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో కొంత భాగాన్ని సీజీఎఫ్ నిధుల నుంచి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆనం తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని, ఈ మేరకు ఆయన తన మాట నిలబెట్టుకున్నారని మంత్రి అన్నారు. హామీ అమలులో భాగంగా బ్రాహ్మణులు, అర్చకులు, వేద పండితులు, వేదాధ్యయనం చేసే విద్యార్థులకు నిరుద్యోగ భృతి ద్వారా ప్రభుత్వం మేలు చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Atchannaidu: ఆ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు..
Former Minister Roja: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి రోజా..
Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు
Updated Date - Nov 05 , 2024 | 08:46 PM