ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nadendla Manohar: ఆ చట్టంపై అవగాహన ఉండాలి

ABN, Publish Date - Dec 24 , 2024 | 02:20 PM

ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చట్టాలు తీసుకువస్తే సరిపోదు, అవి యాక్టివ్‌గా ఉండాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

విజయవాడ: వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. వినియోగదారుల హక్కులు, సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డామని.. ఇక్కడ మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. వినియోగదారుల హక్కులు మర్చిపోయేలా కొందరు వ్యవహరిస్తున్నారన్నారు. టీ పౌడర్ నుంచి కందిపప్పు వరకు కల్తీ జరుగుతుందని తెలిపారు. పిల్లలు తినే చాక్లెట్లలోనూ కల్తీ జరుగుతుందని చెప్పారు.


ALSO READ: AP News: విజయవాడ కోర్టుకు తెలంగాణ ఏపీ ప్రజాప్రతినిధులు

వీటిని నివారించేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ధాన్యం సేకరణ తర్వాత 24 గంటల్లోనే ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. దీపం -2 పథకం ద్వారా 75 లక్షల గ్యాస్ సిలిండర్లు అందించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని అన్నారు. చట్టాలు తీసుకువస్తే సరిపోదు, అవి యాక్టివ్‌గా ఉండాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆహార కల్తీ నివారణకు జిల్లాకో ల్యాబ్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామన్నారు. వినియోగదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చట్టంలోని హక్కులను పౌరులు ఉపయోగించుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..

YCP: వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

Minister Nara Lokesh : శ్యామ్‌ బెనగల్‌ మృతికి లోకేశ్‌ సంతాపం

Read Latest AP News And Telugu news

Updated Date - Dec 24 , 2024 | 02:27 PM