ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Lokesh: జగన్‌కు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN, Publish Date - Sep 16 , 2024 | 07:16 PM

మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో జగన్ విఫలం అయ్యారని అరోపించారు.

Minister Nara Lokesh

అమరావతి: పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ మోహన్‌ రెడ్డికు ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో జగన్ విఫలం అయ్యారని అరోపించారు. ఈ మేరకు (X) ట్విట్టర్ లో మాజీ సీఎం జగన్, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.


ALSO READ: Prakasam Barrages: పడవల తొలగింపులో కొత్త విధానానికి శ్రీకారం...

విద్యాశాఖపై జగన్‌కు కనీస అవగాహన లేదు...

‘‘ఏం చదివావో తెలియదు.. ఎక్కడ చదివావో అస్సలు తెలియదు.. నువ్వు విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది. ఫేక్ జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం.. మీరు తీసుకున్న నిర్ణయాలతో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడంతో పదోతరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది’’ అని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ALSO READ: AP News: గుణదల సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో పోడియం తొలగింపు పనులు షురూ...

సీబీఎస్ఈలో పరీక్షలు..

‘‘ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్య సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సీబీఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయాల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంసమామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. మీరు అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సెలవివ్వండి’’ అని నారా లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Narayana: రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు
Prakasam Barrages: పడవల తొలగింపులో కొత్త విధానానికి శ్రీకారం...

Read Latest AP News AND Telugu News

Updated Date - Sep 16 , 2024 | 07:30 PM

Advertising
Advertising