ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Narayana: ఆ పన్ను తీసేశాం.. మంత్రి నారాయణ కీలక నిర్ణయం

ABN, Publish Date - Dec 10 , 2024 | 10:58 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేశామని మంత్రి నారాయణ ప్రకటించారు. అమృత్ పథకానికి వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో పథకం కింద ఇచ్చే నిధులు ఉపయోగించలేకపోయామని మంత్రి నారాయణ తెలిపారు.

గుంటూరు జిల్లా: వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌లను వదిలేసిందని మంత్రి నారాయణ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్య చాలా స్టడీ చేసిన తర్వాత వేస్ట్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఏడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ నుంచి చెత్తను ఈ ప్లాంట్‌కు తరలిస్తున్నారని తెలిపారు. ఇవాళ(మంగళవారం) జీఎంసీ పరిధిలోని జిందాల్ ప్రాజెక్టును మంత్రి నారాయణ పరిశీలించారు. మంత్రి నారాయణతో పాటు ప్రాజెక్టును ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు , స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాబి పరిశీలించారు. మంత్రి నారాయణకు జిందాల్ పవర్ ప్లాంట్ పనులను అధికారులు వివరించారు.


ప్లాంట్ నిర్వహణ, ఇతర వివరాలు అడిగి మంత్రి నారాయణ తెలుసుకున్నారు. 6890 మెట్రిక్ టన్నుల చెత్తలో 2500 టన్నుల చెత్తను రెండు ప్లాంట్స్ ద్వారా విద్యుత్‌గా మారుస్తున్నారని తెలిపారు. కాకినాడ, నెల్లూరులో త్వరలో ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఒక్క ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. చెత్త పన్ను వేయడం తప్ప చెత్తను ఎలా ఉపయోగించుకోవాలలో వైసీపీ ప్రభుత్వానికి తెలియదని అన్నారు. చెత్త పన్ను తీసేశాం.. చట్ట సవరణ చేసి మరీ చెత్త పన్ను తొలగించామని చెప్పారు. అమృత్ పథకానికి వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో పథకం కింద ఇచ్చే నిధులు ఉపయోగించలేకపోయామని అన్నారు. టన్ను చెత్తను ట్రీట్ చేయాలంటే రూ.500 నుంచి రూ.750లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చు తగ్గించాలంటే చెత్త తరలించడమే మార్గమని మంత్రి నారాయణ అన్నారు.


ఏపీని మోడల్‌గా తీర్చిదిద్దుతాం: పట్టాభి

జిందాల్ ప్లాంట్ ఏర్పాటులో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ కృషి ఎంతో ఉందని స్వఛ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తెలిపారు. విదేశాల్లో ఉన్న సాంకేతికను పరిశీలించిన తర్వాత నారాయణ జిందాల్ ప్లాంట్ నిర్మాణం చేయించారని అన్నారు. చుట్టు పక్కల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ప్లాంట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో ఇటువంటి ప్లాంట్లులు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నామని అన్నారు. జగన్ ప్రభుత్వం 85 వేల టన్నుల చెత్తను ప్రజల నెత్తిన వేసి వెళ్లిందని చెప్పారు. ఏపీని ఘన వ్యర్థాల ట్రిట్‌మెంట్‌లో ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతామని కొమ్మారెడ్డి పట్టాభి రామ్ అన్నారు.


ఈ ప్లాంట్‌తో ప్రజలకు ఎంతో మేలు: ప్రత్తిపాటి పుల్లారావు

16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో జిందాల్ ప్లాంట్ నిర్మాణం చేశారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వేస్ట్ నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్‌తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. వేస్ట్ ఎక్కడిక్కడ పేరుకుపోకుండా చర్యలు చేపట్టినట్లు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోహన్ బాబు ట్వీట్ వైరల్

పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 10 , 2024 | 11:08 AM