ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Nimmala: పుష్కర ఎత్తిపోత‌ల ప‌థకాన్ని నిర్వీర్యం చేశారు

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:16 AM

రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు ప్రస్తుతం శిథిలావ‌స్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్‌కు సంబంధించి పీఎస్‌సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచ‌నాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

అమరావతి: పుష్కర ఎత్తిపోత‌ల ప‌థకంలో భాగ‌మైన తాళ్లూరు లిప్ట్ పైపులు లీకేజీల‌పై అసెంబ్లీలో స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స‌మాధానం చెప్పారు. లిప్ట్ స్కీమ్‌ల నిర్వహణ‌, మోటార్ల మ‌ర‌మ్మత్తుల‌కు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా జ‌గ‌న్ ఎత్తిపోత‌ల‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. అందుకే జ‌గ‌న్ హయాంలో 1040 లిప్ట్ స్కీముల‌కు గానూ 450 స్కీమ్‌లు మూత‌ప‌డ్డాయని తెలిపారు. జగన్ పాల‌న పాపం ఫ‌లితంగా లిప్ట్ స్కీములు ప‌నిచేయక 4ల‌క్షల ఎక‌రాలు బీడుప‌డ్డాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.


తాళ్లూరు లిప్ట్ మాత్రమే కాదని.. రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు ప్రస్తుతం శిథిలావ‌స్థలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్‌కు సంబంధించి పీఎస్‌సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచ‌నాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


ఇరిగేషన్‌ వ్యవస్థ వెనక్కు..

కాగా.. వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ఇరిగేషన్‌ వ్యవస్థ 20 ఏళ్లు వెనక్కిపోయిందని నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల జగన్‌ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో జగన్‌ రాష్ర్టాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. సీఎం చంద్రనాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలు తీర్చే మంచి ప్రభుత్వం వచ్చిందని, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారం అందిస్తున్నారని అన్నారు. జగన్‌ ఇసుకను దోపిడీకి వినియోగిస్తే..చంద్రబాబు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారని వివరించారు. ఇసుక కొరత లేకుండా బోట్స్‌మన్‌ సొసైటీలను పెంచుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.


వారం రోజుల్లో ఓపెన్‌ రీచ్‌లు ప్రారంభమవుతాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం డీసిల్టేషన్‌ ర్యాంపుల వల్ల టన్ను రూ.625కు అమ్మితే తాము రూ.228కే అందిస్తున్నామని చెప్పారు. అందులో రూ.198 బోట్స్‌మన్‌ సొసైటీలకే అందు తుందని.. ఓపెన్‌ రీచ్‌ల వల్ల జగన్ ప్రభుత్వం రూ.475లకు అమ్మితే తాము రూ.145కే టన్ను అందిస్తున్నామని తెలిపారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు సొంత అవసరాలకు ఇసుకను వాడుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ విక్రయిస్తే ఉపేక్షించేలేదని..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్‌అండ్‌బీ రహదారుల్లో గుంతలను ముందుగా పూడ్చనున్నామని..తర్వాత రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు.డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రూ.4500 కోట్లతో గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి చేపట్టిన పల్లె పండుగలో గుర్తించిన పనులను సంక్రాంతికే పూర్తిచేయనున్నామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్రంలో 1080 ఎత్తిపోతల పథకాలు ఉంటే 450 మూతపడ్డాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Updated Date - Nov 21 , 2024 | 11:36 AM