Minister Ramprasad Reddy: జగన్‌ది వన్ సైడ్ లవ్ మాత్రమే... మంత్రి రాంప్రసాద్ రెడ్డి విసుర్లు
ABN, Publish Date - Nov 01 , 2024 | 06:05 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని.. జగన్ అనే వ్యక్తిని మనం ప్రేమించాలే తప్ప అతను ఎవరిని ప్రేమించడు అందులో వారి చెల్లి షర్మిలమ్మ కూడా ఒక భాగమని విమర్శించారు.
చిత్తూరు: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని.. జగన్ అనే వ్యక్తిని మనం ప్రేమించాలే తప్ప అతను ఎవరిని ప్రేమించడు అందులో వారి చెల్లి షర్మిలమ్మ కూడా ఒక భాగమని విమర్శించారు. అతనిది మొత్తం వన్ సైడ్ లవ్ మాత్రమే ఇది పూర్తిగా వారి కుటుంబ వ్యవహారమని అన్నారు . షర్మిలకు ఆమె అన్న జగన్ మోహన్ రెడ్డి వద్ద నుంచి ఆమెకు రావలసిన హక్కుల సాధనకు వీర మహిళగా నువ్వు పోరాడాలి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వంపై వైసిపీ విష ప్రచారం: మంత్రి వాసం శెట్టి సుభాష్
అంబేద్కర్ కోనసీమ జిల్లా: కూటమి ప్రభుత్వంపై వైసిపీ గత నాలుగు నెలలుగా విష ప్రచారం చేస్తుందని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ తెలిపారు. ఇవాళ(శుక్రవారం) సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ... ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు, పోలవరం ప్రాజెక్టులపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి సుభాష్ ఖండించారు.
నిత్యావసర వస్తువుల ధరలపై డిబేట్‌కు సిద్ధమని మంత్రి సుభాష్ తెలిపారు. ఏపీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్త శుద్ధితో పని చేస్తున్నారని అన్నారు. అమరావతి రాజధానిని సరైన ట్రాక్‌లో పెట్టి అభివృద్ధి చేయడానికి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు కానుకగా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. 2014-2019లో తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో రూ. 11వేల 762 కోట్లతో 73 శాతం పనులు చేసిందని అన్నారు. వైసిపీ ప్రభుత్వ హయాంలో రూ. 4,100 కోట్లతో 3.82 శాతం మాత్రమే పోలవరం ప్రాజెక్టు పనులు చేసిందని మంత్రి సుభాష్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Pawan Kalyan: వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు.... పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు
NRI: ఎన్నారైలకు కొత్త అర్థం చెప్పిన ఏపీ మంత్రి నారా లోకేశ్
Free bus travel: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్ధన్ కీలక స్టేట్‌మెంట్
Read latest AP News And Telugu News
Updated Date - Nov 01 , 2024 | 06:07 PM