ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Anuradha: పాయకరావుపేట ఫుడ్ పాయిజన్‌ ఘటనపై శవరాజకీయాలు దారుణం..

ABN, Publish Date - Aug 20 , 2024 | 08:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ శవం కనిపించినా గద్దల్లా వాలిపోయి వైసీపీ నేతలు శవరాజకీయాలకు తెరతీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthi Anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతదేహం సాక్షిగా పుట్టిన పార్టీ వైసీపీ అని ఆమె అన్నారు.

MLC Panchumarthi Anuradha

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ శవం కనిపించినా గద్దల్లా వాలిపోయి వైసీపీ నేతలు శవరాజకీయాలకు తెరతీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthi Anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతదేహం సాక్షిగా పుట్టిన పార్టీ వైసీపీ అని ఆమె అన్నారు. అధికారం కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డని(Jagan Mohan Reddy) ఎమ్మెల్సీ ధ్వజమెత్తారు. పాయకరావుపేటలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతే దానిపైనా శవరాజకీయాలు మెదలుపెట్టారని ఆగ్రహించారు.


వైసీపీ శవరాజకీయాలు చేస్తోంది..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ.. "ఇప్పటివరకు శవరాజకీయాలు చేసిన వైసీపీ కొత్తగా రాబందుల పార్టీగా అవతారమెత్తింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ శవం కనిపించినా సరే వాలిపోయి శవరాజకీయాలకు తెరతీస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టినా సరే సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, సీఎం చంద్రబాబుపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. పాయకరావుపేటలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతే దానిపైనా జగన్ మోహన్ రెడ్డి అండ్ కో రాజకీయాలు మెుదలుపెట్టారు. అనాథాశ్రమంలో జరిగిన ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. విచారణకు ఆదేశించి బాధితులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.10లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ అనాథ శరణాలయాల్లో తనిఖీలు చేపట్టారు. బాధితుల కోసం స్వయంగా సీఎం చంద్రబాబే రంగంలోకి దిగారు. అయినప్పటికీ వైసీపీ శవరాజకీయాలు ప్రారంభించింది.


అప్పుడు జగన్ నోరెందుకు మెదపలేదు..

గత వైసీపీ ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యుర్థులు వాంతులు, కడుపునొప్పితో బాధపడుతుంటే మాజీ సీఎం జగన్ తమాషా చూశారు. అలాంటి వ్యక్తికి కనీసం మాట్లాడే అర్హత ఉంటుందా?. జగన్ రెడ్డి హయాంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో 21మంది ఫుడ్ పాయిజన్‌కు గురైతే ఒక్కరినీ పట్టించుకున్న పాపాన పోలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో 35మంది జగనన్న గోరుముద్ద తిని అస్వస్థతకు గురైతే పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం ఆ ఘటనపై విచారణకు కూడా ఆదేశించలేదు.


పోలవరంలో కలుషిత ఆహారంతో 36మంది మంచం పడితే దానిపై ఒక్కరినైనా విచారించారా?, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారా?. జగన్ రెడ్డి హయాంలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగి సరైన చికిత్స అందక విద్యార్థులు విలవిలలాడిపోయారు. ఈ ఘటనలన్నీ ఆనాడు జగన్ మోహన్ రెడ్డికి కనిపించలేదా?. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్.. సీమలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే నోరెందుకు మెదపలేదు?. ఇన్ని ఘటనలు జరిగినా ఆయన నోరు మెదపలేదు కాబట్టే ప్రజలు ఆయణ్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు" అని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Andhra Pradesh: సీబీఎన్ సర్కార్ సంచలన నిర్ణయం.. సీబీఐకు గ్రీన్ సిగ్నల్

YSRCP Vs TDP: తాడిపత్రిలో మళ్లీ రచ్చ.. ఏబీఎన్ రిపోర్టర్‌ను కాల్చేస్తానంటూ గన్ తీసి..!

Updated Date - Aug 20 , 2024 | 08:33 PM

Advertising
Advertising
<