YCP: తాడేపల్లిలో విజయసాయిరెడ్డిని కలిసిన ఎంపీ ప్రభాకర్‌రెడ్డి
ABN , Publish Date - Jan 10 , 2024 | 09:13 PM
వైసీపీ ( YCP ) రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) తో తాడేపల్లిలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ( MP Adala Prabhakar Reddy ) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

తాడేపల్లి: వైసీపీ ( YCP ) రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) తో తాడేపల్లిలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ( MP Adala Prabhakar Reddy ) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఇన్‌చార్జిగా ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఆదాలకు అధిష్టానం నుంచి సూచనలు, ఆంక్షలు పెట్టినట్లు సమాచారం. మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదాల నివాసానికి ఎందుకు వచ్చారు మీరెందుకు రాణిచ్చారు అని ప్రశ్నించారు. మాగుంటను ఎంటర్ టైన్ చెయ్యొద్దని సూచించినట్లు తెలుస్తోంది. మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను ధూషించాలనే టాస్క్ ఇచ్చినట్లు సమాచారం. తనేందుకు తిట్టలని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. ఇవ్వని జరిగితేనే ఆదాలను పరిగణలోని కి తీసుకుంటామని విజయసాయిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.