Share News

Pilli Manikya Rao: వైసీపీ సైకో డ్రెస్‌తో ఉన్న పోలీసులపై చర్యలు తప్పవు

ABN , Publish Date - Nov 05 , 2024 | 01:34 PM

గత ఐదేళ్లలో పోలీసులు వైసీపీ సైకోలను నియంత్రించలేక పోయారని లీడ్ క్యాప్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. పోలీసులు ఇకనైనా సైకో బ్యాచ్ చేస్తున్న అరాచకాల విషయంలో ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. వైసీపీ వికృత ఆకృత్యాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని అన్నారు.

Pilli Manikya Rao: వైసీపీ సైకో డ్రెస్‌తో ఉన్న పోలీసులపై చర్యలు తప్పవు

అమరావతి: వైసీపీ సైకో డ్రెస్‌తో ఉన్న పోలీసులపై చర్యలు తప్పవని లీడ్ క్యాప్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు హెచ్చరించారు. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) పత్రికా ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి హోదాలో హోం మంత్రికి సూచనలు మాత్రమే చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాటిన విష బీజాలు ఐదేళ్లలో విషవృక్షాలుగా మారాయని పిల్లి మాణిక్యరావు ఆరోపించారు.


గత ఐదేళ్లలో పోలీసులు వైసీపీ సైకోలను నియంత్రించలేక పోయారని విమర్శించారు. పోలీసులు ఇకనైనా సైకో బ్యాచ్ చేస్తున్న అరాచకాల విషయంలో ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. వైసీపీ వికృత ఆకృత్యాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని అన్నారు. చిన్నపిల్లలు, మహిళల పట్ల వికృతంగా ప్రవర్తించే వారిని నడిరోడ్డుపై కాల్చివేయాలన్నా స్థాయిలో ప్రజలు కోరుకుంటున్నారని.. కానీ అందుకు మన చట్టాలు సహకరించలేవవు అనేది ప్రజలు గుర్తించాలని పిల్లి మాణిక్యరావు తెలిపారు.


దిశ కమీటికి చైర్మన్‌గా ఉంటడం చాలా గర్వంగా ఉంది: ఎంపీ కేశినేని శివ‌నాథ్

Kesineni-Chinni.jpg

అమరావతి: దిశ కమీటికి చైర్మన్‌గా ఉంటడం చాలా గర్వంగా ఉందని విజయవాడ ఎంపీ, దిశ చైర్మన్ కేశినేని శివ‌నాథ్ వ్యాఖ్యానించారు. ‘‘వికసిత భారత్‌’’ను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్షా సమావేశం ఇవాళ(మంగళవారం) జరిగింది. ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ, దిశ చైర్మన్ కేశినేని శివ‌నాథ్ , జిల్లా అధికారులు, ఇన్‌చార్జి కలెక్టర్ నిధి మీనా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ... సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన 35 పథకాలను 19 శాఖలు అమలు చేస్తున్నాయని తెలిపారు. అధికారులు ప్రతి పథకాన్ని అర్థం చేసుకొని అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో 2024-2025 నాటికి 16 మండలాల్లోని ప్రజలకు ఈ పథకాలను అందజేయటమే లక్ష్యమని అన్నారు. జిల్లాలో ప్రధాన్ మంత్రి ముద్ర యోజన పథకం కింద 2023-2024 ఏడాదిలో విజయం సాధించినందుకు అధికారులను ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినందించారు.


ఇవి కూడా చదవండి..

Nimmala: ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

AP HighCourt: ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య కేసు.. హైకోర్టులో వైసీపీ నేతకు షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 01:56 PM