ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం

ABN, Publish Date - Nov 17 , 2024 | 07:07 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు(72) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఇవాళ(ఆదివారం) ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లనున్నారు. ఏఐజీ హాస్పిటల్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రామ్మూర్తినాయుడి భౌతికకాయం చేరుకుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దగ్గరుండి తన చిన్నాన్న భౌతికకాయాన్ని నారావారిపల్లెకు మంత్రి నారా లోకేష్ తరలిస్తున్నారు.

ప్రత్యేక విమానంలో నారా రామ్మూర్తి నాయుడు పార్థీవదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి నారా లోకేష్ తీసుకురానున్నారు. 7: 45గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానం చేరుకోనుంది. 9 గంటలకు నారావారిపల్లిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటికి రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహం చేరుకోనుంది. నారా లోకేష్‌తో పాటు నారా , నందమూరి కుటుంబాలు, పార్టీ శ్రేణులు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఉదయం 9:30గంటల నుంచి రామ్మూర్తి నాయుడుని చివరి చూపు చూడడానికి కార్యకర్తలకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 2:30గంటలకు నారావారిపల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి నారా రామూర్తి నాయుడు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. నారావారిపల్లెలోని నారా రామ్మూర్తి నాయుడు అమ్మానాన్నలు సమాధులు ఉన్న చోటే నారా రామూర్తి నాయుడుకి అంతిమ సంస్కారాలు చేయనున్నారు.


అంత్యక్రియలకు చంద్రబాబు..

తన సోదరుడు రామ్మూర్తినాయుడి అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. ఉదయం 9గంటలకు హైదరాబాద్ నివాసం‌ నుంచి బేగంపేట్‌కు చంద్రబాబు వెళ్తారు. 9.20గంటలకు బేగంపేట్ నుంచి ప్రత్యక విమానంలో తిరుపతికి ఏపీ సీఎం వెళ్లనున్నారు. 10.05గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు చేరుకోను‌న్నారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గాన 10.50గంటలకు ఏపీ ముఖ్యమంత్రి నారావారిపల్లెకు వెళ్లి రామ్మూర్తినాయుడి అంత్యక్రియల్లో పాల్గొంటారు.


అనారోగ్యంతో రామ్మూర్తినాయుడు కన్నుమూత

కాగా. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు(72) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 14న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులుగా ఆరోగ్యం విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి అత్యాధునిక చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని, మధ్యాహ్నం 12.45గంటలకు కార్డియాక్‌ అరెస్టుతో తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య ఇందిర, కుమారులు గిరీశ్‌, రోహిత్‌ ఉన్నారు. వీరిలో రోహిత్‌ సినీనటుడు కాగా, గిరీశ్‌ గల్ఫ్‌లో వ్యాపారం చేస్తున్నారు.


సోదరుడి ఆరోగ్యం విషమించిన వార్త తెలియగానే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. తమ్ముడి పార్ధివదేహానికి నివాళులర్పించి, ఆయన కుమారులు రోహిత్‌, గిరీశ్‌ను ఓదార్చారు. రామ్మూర్తినాయుడు భౌతికకాయం ఆదివారం ఉదయం 8 గంటలకు విమానంలో రేణిగుంటకు చేరుకోనుంది. అక్కడి నుంచి 9గంటలకు స్వస్థలమైన చంద్రగిరి మండలం నారావారిపల్లికి తరలించనున్నారు. నారావారిపల్లిలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు నారా, నందమూరి కుటుంబీకులు హాజరు కానున్నారు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ నుంచి సైతం పలువురు నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.


రాజకీయ నేపథ్యం

తొలినాళ్లలో అన్న చంద్రబాబు వెన్నంటి నడుస్తూ రాజకీయంగా తోడునీడగా నిలిచిన రామ్మూర్తినాయుడు 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1994 ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్‌ పొంది కాంగ్రెస్‌ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై 16వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. 1999లో వర్గ రాజకీయాలతో ముఖ్య నేతలు సహాయ నిరాకరణ చేయడంతో ఓటమి పాలయ్యారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో 2003లో టీడీపీ వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే చంద్రగిరి అసెంబ్లీ టికెట్‌ విషయంలో కాంగ్రెస్‌ పెద్దలు మొండిచేయి చూపడంతో 2004 ఎన్నికల సమయంలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే టీడీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. రామ్మూర్తినాయుడు ఓట్లు చీల్చడం వల్లే కాంగ్రెస్‌ అభ్యర్థి గల్లా అరుణకుమారి సునాయాసంగా విజయం సాధించారు.

Updated Date - Nov 17 , 2024 | 07:50 AM