ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ

ABN, Publish Date - Dec 17 , 2024 | 01:46 PM

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు.

ఢిల్లీ: జమిలి బిల్లుకు ఇవాళ(మంగళవారం) పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. జమిలీ బిల్లుకు మద్దుతు ఇస్తున్నట్లు లోక్‌సభలో తెలిపారు. జమిలి బిల్లును తదుపరి చర్చకు తీసుకోవడంపై ఇవాళ లోక్‌సభలో ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో తొలిసారి ఓటింగ్‌ జరుగుతుంది. లోక్‌సభలో పూర్తి ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. ఓటింగ్‌ విధానాన్ని సభ్యులకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ వివరించారు.


టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పునకు సీఎం చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని తెలిపారు. జమిలీ ఎన్నికల వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుందన్నారు. మీడియా రిపోర్టులు ఆధారంగా జనరల్ ఎన్నికలకు రూ. 6 వేల కోట్లు ఖర్చు అయ్యిందని వివరించారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల ఓటింగ్ శాతం( 7 శాతం) పెరుగుతుందని అన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల ఎన్నికల కమిషన్ ఖర్చు, రాజకీయ పార్టీల ఖర్చు తగ్గుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల కోసం పార్లమెంట్లో చట్టం చేయబోతోందని, దానిని అందరూ ఆమోదించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.


వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతు: లావు శ్రీకృష్ణదేవరాయలు

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లుకు టీడీపీ పార్టీ మద్దతిస్తుందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అభివృద్ధికి అనుకూల బిల్లు కాబట్టి మద్దతిస్తున్నామన్నారు. దేశంలో సుపరిపాలనకు ఈ బిల్లు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. అభివృద్ధి, సుపరిపాలనపై చర్చ జరిగినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుంటారని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP : సజ్జల భార్గవ్‌ కేసుల వివరాలన్నీ ఇవ్వండి

Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి

AP Skill Development : ఏపీలో 532 స్కిల్‌ హబ్‌లు

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 17 , 2024 | 01:50 PM