IPS Transfer: 16మంది ఐపీఎస్‌లు బదిలీ.. ఎవరికెక్కడ పోస్టింగంటే..
ABN, Publish Date - Sep 25 , 2024 | 09:41 PM
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 16 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ బదిలీ అయ్యారు. ఎం.రవిప్రకాశ్ పీ అండ్ ఎల్ ఐజీగా బదిలీ అయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 16 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ బదిలీ అయ్యారు. ఎం.రవిప్రకాశ్ పీ అండ్ ఎల్ ఐజీగా బదిలీ అయ్యారు. పీహెచ్‌డీ రామకృష్ణను ఇంటెలిజెన్స్ ఐజీగా, ఫకీరప్పను ఇంటెలిజెన్స్ ఎస్పీగా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆర్ఎన్ అమ్మిరెడ్డికి డీజీపీ కార్యాలయంలో ఐజీ డీఐజీ అడ్మిన్‌గా పోస్టింగ్ ఇచ్చారు. సీహెచ్ విజయరావుకు డీఐజీ రోడ్ సేఫ్టీ అథారిటీగా పోస్టింగ్ ఇచ్చారు. సిద్ధార్థ్ కౌషల్‌ను శాంతిభద్రతల ఏఐజీగా, మేరీ ప్రశాంతిని విశాఖ శాంతిభద్రతల డీసీపీ-2గా, తుహిన్ సిహ్నాకు అనకాపల్లి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.
అలాగే ఎం.దీపికకు ఏపీఎస్పీ-3 బెటాలియన్ కమాండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. జి.రాధికను ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఆరిఫ్ హఫీజ్‌ను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా, కెఎస్ఎస్వీ సుబ్బారెడ్డికి పీటీవో ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. బాపూజీ అట్టాడను పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కె.తిరుమలేశ్వర్ రెడ్డికి ఎన్టీఆర్ కమిషనరేట్‌లో క్రైమ్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. కేవీ శ్రీనివాసరావును పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు వచ్చాయ్.. సంవత్సరంలో..
Satya Kumar: మంత్రి సత్యకుమార్ హెచ్చరిక.. ఆ విషయంలో జగన్‌కు శిక్ష తప్పదు..
Gudivada: కాశీ తాళ్లు కట్టుకుంటే భక్తులైపోరు.. కొడాలి నానిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
Updated Date - Sep 25 , 2024 | 09:52 PM