AP News: దారుణం.. వెలుగు చూసిన మరో రెండు అత్యాచార ఘటనలు..
ABN, Publish Date - Nov 18 , 2024 | 09:58 PM
బాపట్ల పట్టణంలో కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. 65 ఏళ్ల ఓ వృద్ధుడు తన వయస్సు కూడా మరిచి 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు.
అమరావతి: మహిళలు, చిన్నారులు కనిపించారంటే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఆడపిల్ల పుట్టిందంటే తల్లిదండ్రులు కంటి మీద రెప్ప వేయకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. బంధువులు, కుటుంబసభ్యుల రూపంలోనూ కామాంధులు దర్శనమిస్తుంటే నేటి సమాజంలో ఎవర్ని నమ్మాలో అర్థంకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు సైతం దారి తప్పుతూ చిన్నారులపై లైంగిక దాడులకు తెగబడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. పాఠశాలలు, రోడ్లు, బస్సులు.. చివరికి ఇల్లూ వారికి రక్షణ కల్పించలేకపోతోంది. మహిళలు, చిన్నారులు కనిపిస్తే చాలు లైంగికంగా వేధిస్తూ కామవాంఛలు తీర్చుకోవాలని చూస్తున్నారు కామాంధులు.
CM Chandrababu: గురు కనకదాస జయంతి శుభాకాంక్షలు తెలిసిన సీఎం చంద్రబాబు..
తాజాగా బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో అటువంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. బాపట్ల పట్టణంలో కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. 65 ఏళ్ల ఓ వృద్ధుడు తన వయస్సు కూడా మరిచి 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. చిన్నారి అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించారు. వృద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. వృద్ధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెపై లైంగిక దాడికి యత్నించిన అతనికి కఠిన శిక్షవేయాలని పోలీసులను వేడుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Former Minister Roja: ఏపీలో హిట్లర్, గడాఫి కలిసి పాలన చేస్తున్నట్లు ఉంది: ఆర్కే రోజా..
నెల్లూరు జిల్లాలోనూ ఇటువంటి దారుణ ఘటనే ఒకటి వెలుగు చూసింది. రూరల్ మండలంలో బాలికపై దూరపు బంధువు అత్యాచారానికి ఒడిగట్టాడు. పాఠశాల నుంచి వచ్చిన చిన్నారిపై దూరపు బంధువు పెంచలయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం, ఏకంగా బాలిక తల్లే నిందితుడిని పోత్సహించడంతో పెంచలయ్య అత్యాచారం చేశాడని బాలిక తండ్రే ఆరోపిస్తున్నాడు. బాలిక తల్లి ప్రోత్సాహంతోనే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లైంగిక దాడి గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇటీవల అత్యాచార, హత్యాచార ఘటనలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
YS Sharmila: మహిళా భద్రతపై టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన షర్మిల..
TTD: స్వామివారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. సంచలన నిర్ణయాలు ఇవే..
Updated Date - Nov 18 , 2024 | 10:00 PM