AP News: రాష్ట్రపతి ముర్మును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి .. ఎందుకంటే..?
ABN, Publish Date - Jun 13 , 2024 | 05:53 PM
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు (గురువారం)భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Murmu) బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) కలిశారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఢిల్లీ: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు (గురువారం)భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Murmu) బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) కలిశారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం ఢిల్లీ కేంద్రంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్లాన్ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తారని అన్నారు.
ఈ కార్యక్రమం కోసమే రాష్ట్రపతిని కలిసినట్లు వివరించారు. ఈ ప్రోగాంకు సంబంధించిన సమగ్రమైన నివేదికను పంపించాలని రాష్ట్రపతి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము కచ్చితంగా వస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా గతంలో నెహ్రూ కేంద్ర సంఘటన ద్వారా దేశంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేకమైన నివేదికను రాష్ట్రపతికి అందజేసినట్లు వివరించారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన యువజన క్రీడల మంత్రిత్వశాఖ ద్వారా చేపట్టిన వందలాది కార్యక్రమాలు, వాటి ద్వారా యువత పొంది లబ్ధి గురించి రాష్ట్రపతికి వివరించినట్లు చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులను గుర్తించి వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు చాలా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వీటితో పాటు దేశంలో విద్యార్థి, యవత కోసం ప్రత్యేకంగా యాత్ పార్లమెంట్ నిర్వహించి నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని ప్రోత్సహించినట్లు చెప్పారు. అదే విధంగా ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా వేల మంది విద్యార్థులను వివిధ రాష్ట్రాలకు పంపి అక్కడ అభివృద్ధి, స్థితిగతులపై వారికి అవగాహన కలిగేలా పలు రకాల కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఓ ప్రకటనలో రాష్ట్రపతి ముర్ముకు విష్ణువర్ధన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మొదటి సంతకం ఈ ఫైల్‌పైనే..!
AP News: రాష్ట్రపతి ముర్మును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి .. ఎందుకంటే..?
Read Latest Andhra Pradesh News and Telugu News
Updated Date - Jun 13 , 2024 | 07:07 PM