Andhra Pradesh: బడ్జెట్‌తో ఏపీకి జరిగే లాభం ఎంత..? కేంద్రం నిజంగానే మెలికలు పెట్టిందా..
ABN, Publish Date - Jul 24 , 2024 | 04:47 PM
కేంద్రపభుత్వం రూ.48,20,512 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, యువత, మహిళలు, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించింది.
కేంద్రపభుత్వం రూ.48,20,512 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, యువత, మహిళలు, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించింది. గతానికి భిన్నంగా మోదీ ప్రభుత్వం ఈసారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది. నేరుగా ప్రజల్లో ఖాతాల్లో డబ్బులు వేసే సంక్షేమం కాకుండా.. పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా పలు పథకాలను రూపొందించింది. ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతమివ్వాలనే థీమ్‌తో కేంద్రప్రభుత్వం బడ్జెట్ తయారుచేసింది. ఈ బడ్జెట్‌పై దేశంలోని రాజకీయ పక్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఎన్డీయే పాలిత రాష్ట్రాలు బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలు మాత్రం బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఏదైనా లాభం కలుగుతుందా.. ఇక్కడి ప్రజలను మెప్పించేందుకే నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పేరును ఎక్కువసార్లు పలికారా అనే సందేహం చాలామందిలో నెలకొంది.
AP Assembly: వైసీపీ ఎక్సైజ్ పాలసీపై ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏమన్నారంటే?
అమరావతికి..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ నిధులను నేరుగా కేంద్రప్రభుత్వం అందిస్తుందా.. లేదా అప్పు రూపంలో రాష్ట్రానికి ఇస్తుందా అనే అనుమానం ఎక్కువమందికి కలుగుతోంది. ఎవరికి వారు దీనిపై విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి కేంద్రప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఈ మొత్తాన్ని అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. దేశంలో పరిస్థితుల ఆధారంగా మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను ఉపయోగిస్తారు. మరి అమరావతి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం 15వేల కోట్లు ఎలా ఇస్తుందనేది పెద్ద ప్రశ్న.. వరల్డ్ బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం గ్యారంటీగా ఉండి ఈ ఏడాది 15వేల కోట్ల రూపాయిలను రుణం ఇప్పిస్తుంది. ఈ మొత్తంతో రాజధాని నిర్మాణం జరిగి... అక్కడ పరిశ్రమలు, ఐటీ కంపెనీల ఏర్పాటుతో అభివృద్ధి జరిగి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరిగితే రాష్ట్రప్రభుత్వం ఈ రుణాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో కేంద్రప్రభుత్వమే ఆ రుణం మొత్తాన్ని వివిధ మార్గాల్లో చెల్లిస్తుంది. కేంద్రప్రభుత్వం హామీదారుడిగా ఉండటంతో రాష్ట్రప్రభుత్వంపై నేరుగా రుణ భారం పడే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో ఏదో ఒక రూపంలో అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవడం ద్వారా రాష్ట్రానికి లాభం కలిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం మెలిక పెట్టింది.. అప్పు మాత్రమే ఇస్తోందని విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పులు చెల్లించేలా లేకపోవడంతో కేంద్రప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఫెడరల్ సిస్టమ్‌లో కేంద్రానికి వచ్చే ఆదాయంలో నేరుగా ఒక రాష్ట్రానికి భారీగా నిధులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో వివిధ ఆర్థిక సంస్థల ద్వారా కేంద్రం రాష్ట్రానికి సహాయం చేస్తుందని చెప్పుకోవచ్చు.
CM Chandrababu: వైసీపీ ఎక్సైజ్ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం..
పోలవరానికి
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో దానిని పూర్తిచేసే బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉంటుంది. దీంతో ప్రాజెక్టుకు ఎంత మొత్తంలో నిధులు ఇస్తామనేది బడ్జెట్‌లో పేర్కొనకపోయినా.. ప్రాజెక్టుకు అయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రప్రభుత్వమే భరిస్తుందనే విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్‌లో స్పష్టం చేశారు. విశాఖపట్టణం-చెన్నై పారిశ్రామిక కారిడర్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని బడ్జెట్‌లో చెప్పారు. దేశ వ్యాప్తంగా పలు పారిశ్రామిక కారిడర్‌లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుతో దేశానికి సైతం పన్నుల రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఇండస్ట్రీయల్ కారిడర్ డెవలప్‌మెంట్‌కు కేంద్రం నిధులు ఇవ్వనుంది. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఏపీ విభజన చట్టంలో ఉండటంతో అదే విషయాన్ని కేంద్రమంత్రి చెప్పారు. ఇప్పటికే దేశంలో వెనుకబడిన రాష్ట్రాలు, జిల్లాల అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు నిధులు ఇవ్వనుంది. కేంద్రప్రభుత్వం బడ్జెట్ పొందుపర్చిన విధంగా ఆంధ్రపదేశ్‌కు నిధులు సమకూరిస్తే తప్పకుండా రాష్ట్రప్రభుత్వంపై కొంత ఆర్థిక భారం తగ్గడంతో పాటు.. వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
JC Prabhakar: చంద్రబాబును కొద్దిగా వదిలిపెట్టమను... మేమేంటో చూపిస్తాం
TS News: తమను వెదకొద్దంటూ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాతమ్ముళ్లు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jul 24 , 2024 | 06:12 PM