ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Big Breaking: హెరిటేజ్ డాక్యుమెంట్స్ తగులబెట్టిన సిట్..!

ABN, Publish Date - Apr 08 , 2024 | 11:48 AM

తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో హెరిటేజ్ సంస్థ కి సంబంధించిన డాక్యుమెంట్లను కార్యాలయ సిబ్బంది తగులబెట్టారు. హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఆపి ఇదేంటని ప్రశ్నించగా.. పత్రాలు తగలబెట్టి వీడియోలు తమకి పెట్టమని సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని సీఐడీ కార్యాలయం సిబ్బంది చెప్పారట.

అమరావతి: తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్‌లో హెరిటేజ్ సంస్థ కి సంబంధించిన డాక్యుమెంట్లను కార్యాలయ సిబ్బంది తగులబెట్టారు. హెరిటేజ్ పత్రాలు దగ్ధం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఆపి ఇదేంటని ప్రశ్నించగా.. పత్రాలు తగలబెట్టి వీడియోలు తమకి పెట్టమని సిట్ అధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని సీఐడీ కార్యాలయం సిబ్బంది చెప్పారట. హెరిటేజ్ సంస్థకి సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర కీలక డాక్యుమెంట్స్‌ను సిట్ సిబ్బంది తగలబెట్టింది. రఘురామ్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని సిట్ సిబ్బంది చెబుతోంది.

AP Elections:చావులతో రాజకీయం.. జగన్‌పై జనం ఆగ్రహం..!


సీఎం జగన్ ఆదేశాలతో టీడీపీ అధినేత చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సిట్ అనేక అక్రమ కేసులు బనాయించింది. చంద్రబాబు (Chandrababu)కి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ అనేక మందిపై ఒత్తిడి తెచ్చింది. ఎటువంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటి రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డి దారిన సీఐడీ అధికారులు సంపాదించారు. అవే డాక్యుమెంట్స్ చూపించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను సీఐడీ ప్రశ్నించింది. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని ఆరోజే లోకేష్ అధికారులను నిలదీశారు. చంద్రబాబును అనేక కేసుల్లో ఇరికించేందుకు అనేక తప్పుడు కేసులు, తప్పుడు పత్రాలను సీఐడీ అధికారులు సృష్టించారు. అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో రఘురామ్ రెడ్డి అలెర్ట్ అయ్యారు. దీంతో ఫేక్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టమని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకి పోవడం ఖాయమని సీఐడీ అధికారుల్లో చర్చ ప్రారంభమైందట. అందుకే డాక్యుమెంట్స్ అన్నీ దగ్ధం చెయ్యమని ఆదేశాలు వచ్చాయని సీఐడీ సిబ్బంది చెబుతున్నారు.

AP Elections: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో చెప్పేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే...

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 11:48 AM

Advertising
Advertising