Share News

జగన్ అనే నేను..

ABN , Publish Date - May 02 , 2024 | 03:52 AM

‘‘నేను చంద్రబాబుకు వ్యతిరేకం కాదు. రాష్ట్రానికి ధర్మకర్తను. మా ప్రభుత్వం రెవెల్యూషనరీగా ఉంటుంది.

జగన్ అనే నేను..

పదవీప్రమాణానికి తూట్లు పొడిచేస్తా

‘‘నేను చంద్రబాబుకు వ్యతిరేకం కాదు. రాష్ట్రానికి ధర్మకర్తను. మా ప్రభుత్వం రెవెల్యూషనరీగా ఉంటుంది. ఆరునెలల నుంచి ఏడాదిలోపే దేశంలోనే ‘ది బెస్ట్‌’ అనిపించుకుంటాం. ఎక్కడా అవినీతి లేకుండా చేస్తాం. ఈ ప్రక్షాళన మాములుగా ఉండదు. ఎలా చేయాలో అలా చేసి చూపిస్తాం!’’

- ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు ఢిల్లీలో జగన్‌ ముద్దు ముద్దుగా చెప్పిన మాటలు! ఆరు నెలలు కాదుకదా... తొలి ఆరు రోజుల్లోనే జగన్‌ ఎలాంటి పాలన సాగిస్తారో జనానికి అర్థమైపోయింది.

రాజ్యాంగాన్ని, చట్టాన్నీ పాటించను

ఆశ్రిత పక్షపాతమే మా విధానం

గిట్టని వారిపట్ల ద్వేషంతో వ్యవహరిస్తాను

రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపను

విలువలు పాటించను, పట్టించుకోను

భయపెట్టేలా పాలన సాగిస్తాను

ప్రజాధనంతో పండగ చేసుకుంటాను

అంతఃకరణ శుద్ధిలో పగా, ప్రతీకారమే

జగన్‌ ఐదేళ్ల పాలన సాగింది ఇలాగే!

  • ‘శాసనం’పట్ల గౌరవమిదేనా?

ప్రభుత్వం ఏదైనా శాసనాలను అనుసరించి పాలన సాగించాల్సిందే. అప్పటిదాకా ఉన్న పద్ధతులను మార్చాలనుకుంటే... ఆ మేరకు శాసనాలనూ సవరించాలి. కానీ... జగన్‌ సర్కారుకు ఇవేవీ పట్టలేదు. ‘నేను చెప్పిందే శాసనం’ అన్నట్లుగా వ్యవహరించారు. ఇలా చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలన్నింటికీ న్యాయస్థానాల్లో చుక్కెదురైంది. అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేయలేక... విపక్షాలను, మీడియాను ఆడిపోసుకోవడం రివాజుగా మారింది. అధికారంలోకి వచ్చీ రాగానే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను రద్దు చేశారు. ఇది అంతర్జాతీయంగా కూడా వివాదాస్పదమైంది. దేశ ప్రతిష్ఠకూ మచ్చ తెచ్చారు. ఇక... నిమ్మగడ్డ రమేశ్‌ అంటే గిట్టకపోవడంతో, రాత్రికి రాత్రి ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదించేశారు. దీనిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరీ చీవాట్లు తిన్నారు. చెప్పుకొంటూ పోతే ఇలాంటివి ఎన్నెన్నో!

  • రాగ ద్వేషాలు లేవా జగన్‌?

‘రాగద్వేషాలు చూపకుండా పాలన సాగిస్తాను’ అని ప్రమాణం చేసిన జగన్‌... ఆ మరుక్షణమే ఆ మాట మరిచిపోయారు. అయిన వారిపట్ల ‘రాగం’... విపక్షాల పట్ల ‘ద్వేషం’... ఈ రెండింటి ప్రాతిపదికనే మొత్తం ఐదేళ్ల పాలన సాగింది. సోషల్‌ మీడియాలో సర్కారును ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టిన వారిని వెతికి వెతికి మరీ అరెస్టు చేశారు. ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసిన ‘నేరానికి’ 60 ఏళ్లు పైబడిన వ్యక్తిని విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తీసుకెళ్లి శారీరకంగా, మానసికంగా హింసించారు. ఇలాంటి కేసులోనే గుంటూరుకు చెందిన వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో వేధించారు. కానీ... న్యాయమూర్తులను దూషించిన వైసీపీ కార్యకర్తలను మాత్రం స్వేచ్ఛగా వదిలేశారు. ఇవే కాదు... కేసులు, దాడులు, అరెస్టులు అన్నింటా ఇదే తీరు.

  • అచ్చోసిన పక్షపాతం...

‘పక్షపాతం లేకుండా పాలన సాగిస్తాను’ అని జగన్‌ చేసిన ప్రమాణం ఒక్క క్షణం కూడా అమలు కాలేదు. కుర్చీలో కూర్చున్న క్షణం నుంచి ‘మన వాడెవడు, పరాయి వాడెవడు’ అనే కోణంలోనే నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, సలహాదారులు, నామినేటెడ్‌ పోస్టులు, ఇతర కీలక నియామకాలన్నింటిలోనూ ‘మనవాళ్లే’ ఉండాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లోనూ పక్షపాతమే! అస్మదీయులకు అడ్డదారిలో డబ్బులు ఇచ్చేసి... కాని వారి బిల్లులను మురగబెట్టారు. ఈ ఐదేళ్ల పాలన మొత్తం అచ్చోసిన పక్షపాతం!

  • ‘భయం’ లేకుండా భయపెట్టారు

‘భయం లేకుండా పాలన సాగిస్తాను’ అనేది పదవీ ప్రమాణం! కానీ, జగన్‌ పాలన మొత్తం భయపెట్టడమే లక్ష్యంగా సాగింది. విపక్ష పార్టీల వారి ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు విచ్చలవిడిగా దండోపాయాన్ని ప్రయోగించారు. టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన శిద్ధా రాఘవరావును దారిలోకి తెచ్చుకునేందుకు ఆయన గ్రానైట్‌ గనుల్లో కార్యకలాపాలను నిలిపివేయించారు. చరిత్రలో కనీవినీ ఎరుగనంత జరిమానాలు విధించారు. ఆ తర్వాత.. ఆయన వైసీపీలో చేరగానే నోటీసులు, జరిమానాలూ అన్నీ హుష్‌కాకి! ఇలా టీడీపీ నేతలకు చెందిన వ్యాపారాలు, సంస్థలే లక్ష్యంగా జరిగిన దాడులు ఎన్నెన్నో! రాష్ట్రంలో ఇలా భయంలేకుండా అరాచకాలు సాగించిన జగన్‌... కేంద్ర ప్రభుత్వానికి భయపడుతూనే పాలన సాగించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా... స్వీయరక్షణే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలకు సలాములు చేస్తూ గడిపారు.

  • అంతఃకరణ శుద్ధి... ఇదేనా?

‘అంతఃకరణ శుద్ధితో కర్తవ్య నిర్వహణ’ ఒక పెద్ద జోక్‌! జగన్‌ అంతరంగమంతా పగ, ప్రతీకారాలతోనే నిండిపోయినప్పుడు ‘శుద్ధి’కి చోటెక్కడ! కుర్చీలో కూర్చున్న క్షణం నుంచే ఆయన మనసు ‘పగా... పగా’ అని రగిలిపోయింది. అప్పుడెప్పుడో జరిగిన కృష్ణా పుష్కరాల పనుల్లో అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. గోదావరి పుష్కరాల పనులపైనా ఆరోపణలు చేశారు. కేవలం ఒక అజెండాతో అమరావతిని అటకెక్కించారు. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అన్నారు. నైపుణ్యాభివృద్ధిని ‘స్కామ్‌’ అన్నారు. మద్యం విధానంపైనా కేసు పెట్టారు. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుతో మొదలుకుని చంద్రబాబు దాకా అనేకమంది టీడీపీ నేతలను అరెస్టు చేయించారు. ఇదీ జగన్‌ అంతఃకరణ శుద్ధి!

  • నిజమైన విశ్వాసం, విధేయత చూపారా?

‘రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత’ చూపడమంటే... పాలనలో నైతిక విలువలూ పాటించడం అని అర్థం! ముఖ్యమంత్రిగా జగన్‌ అన్ని విలువలనూ వదిలేశారు. ఒకే స్కీమ్‌కు సంవత్సరానికి నాలుగుసార్లు బటన్‌ నొక్కి... నొక్కిన ప్రతిసారీ తన రోత పత్రికకు ప్రజాధనంతో కోట్లకొద్దీ ప్రకటనలు జారీ చేశారు. ఇలా ఐదేళ్లలో అధమ పక్షం రూ.500 కోట్లు జేబులో వేసుకున్నారు. గిట్టని మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేశారు. తన రోత మీడియాలో పని చేస్తున్న అనేక మందికి లక్షల్లో జీతాలిస్తూ ప్రభుత్వంలో పునరావాసం కల్పించారు.

  • ప్రజలందరికీ ‘న్యాయం’ ఎక్కడ?

‘రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాను’.. ఇది ప్రమాణంలో మరో ముఖ్యమైన విషయం. ఈ ప్రభుత్వం నిజంగానే ప్రజలందరికీ న్యాయం చేస్తోందా? ఈ ప్రశ్నకు రాజధాని రైతులను అడిగితే సమాధానం చెబుతారు. ఎప్పుడూ, ఎన్నడూ లేనివిధంగా ఒక్క రూపాయి తీసుకోకుండా రాజధాని కోసం వీరు భూములు ఇచ్చారు. ‘‘ఇక్కడ అమరావతి పేరిట ఒక సరికొత్త నగరం నిర్మిస్తున్నాం. మీ వాటాగా వచ్చిన ప్లాట్ల ధర పెరుగుతుంది’’ అని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే భూములు ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చి... అమరావతికి చరమగీతం పలికింది. మరి.. భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి? వారికి న్యాయం ఎలా చేస్తాం? ఇవేవీ చెప్పలేదు. మరి... రాజధాని రైతులు ప్రజల్లో భాగం కారా? వారికి ఎలా న్యాయం చేస్తామో చెప్పకుండా మూడుముక్కలాట ఎందుకు మొదలుపెట్టినట్లు?

‘అంతఃకరణ శుద్ధి’తో రుషికొండకు గుండు

జగన్‌ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు... విశాఖలో రుషికొండకు గుండుకొట్టి, అక్కడ జనం ధనంతో విలాసవంతమైన ప్యాలెస్‌ కట్టించుకోవడం! అన్ని రకాల చట్టాలను ఉల్లంఘించి టూరిజం ప్రాజెక్టు ముసుగులో ప్యాలె్‌సలు నిర్మించారు. రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు.

‘‘జగన్‌ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని... భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడతానని... నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని... భయం కానీ, పక్షపాతంకానీ, రాగద్వేషాలుకానీ లేకుండా... రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను!’’

- ఇది 2019 మే 31వ తేదీన జగన్‌ చేసిన ప్రమాణం! దీనిని జగన్‌ కనీసం ఒక్కరోజైనా పాటించారా? పదవి నాటి ప్రమాణాలు అమలవుతున్నాయా? పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా పాలన సాగించారా? రాజ్యాంగాన్ని అనుసరించారా? ప్రజలందరికీ న్యాయం చేశారా? అంటే... ‘లేదు.. లేదు’ అనే సమాధానమే వస్తుంది. ఇంకా చెప్పాలంటే... ప్రజాస్వామ్య చరిత్రలోనే లేని బరితెగింపు కనిపించింది.

Updated Date - May 02 , 2024 | 03:52 AM