ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:46 PM

తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు.

అమరావతి: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా రాక్షసపాలన సాగుతోందని జగన్ విమర్శించారు.

‘‘వైసీపీ నేతలకు నోటీసులిచ్చి అడ్డుకున్నారు. వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. స్వామివారిని దర్శించుకుంటామంటే అరెస్ట్‌ చేస్తామంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా? 100 రోజులపాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే. అడ్డగోలుగా ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. ఇప్పుడు డిక్లరేషన్‌ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. తిరుమలలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతుంది.


నాణ్యతలో ఏవైనా తేడాలొస్తే ట్యాంకర్లను తిరిగి పంపిస్తారు. తిరుమలకు సంబంధించి ఏ నిర్ణయమైన టీటీడీ బోర్డు సభ్యులే తీసుకుంటారు. లడ్డూ తయారీ టెండర్లలో ఎవరూ తక్కువ ధర కోట్ చేస్తే వారికే టెండర్లు అప్పగిస్తారు. బాబు హయాంలో గతంలో 15 సార్లు ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపారు. మా హయాంలో 18సార్లు ట్యాంకర్లను తిప్పి పంపాం. తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను కావాలనే దెబ్బతీస్తున్నారు. తప్పు చేయాలనుకున్నా.. టీటీడీలో అది జరగని పని’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు


తిరుమలకు వచ్చిన నెయ్యిని మూడు సార్లు పరీక్షిస్తారని జగన్ అన్నారు. "జులై 6, 12 తేదీల్లో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. ఆ నాలుగు ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్‌ అయ్యాయి. టెస్టులు ఫెయిల్‌ అయిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపారు. టెస్ట్‌లు ఫెయిల్‌ అయితే మైసూర్‌ ల్యాబ్‌కు పంపుతారు.. కానీ తొలిసారి ఈ శాంపిల్స్‌ను గుజరాత్‌కు పంపారు. ట్యాంకర్లను వెనక్కి పంపి సదరు కంపెనీకి నోటీసులు ఇచ్చారు. 2 నెలల తర్వాత చంద్రబాబు జంతువుల కొవ్వు కలిసిందన్నారు. ఆ మరుసటి రోజే టీడీపీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను బయటపెట్టారు. కల్తీ నెయ్యి ప్రసాదాలకు వాడలేదని సెప్టెంబర్ 20న ఈవో చెప్పారు. ఈ నెల 22న ఈవో ఇచ్చిన నివేదికలో కూడా ట్యాంకర్లు వెనక్కి పంపినట్లు ఉంది. అబద్ధాలతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు" అని జగన్ అన్నారు

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 04:25 PM