ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kesineni Chinni: ఓటమి ఫ్రస్టేషన్‌లో దాడులకు దిగుతున్న వైసీపీ నేతలు

ABN, Publish Date - Apr 02 , 2024 | 06:53 PM

వైసీపీ (YSRCP) నేతలు ఓటమి భయంతో ఫ్రస్టేషన్‌లో దాడులకు దిగుతున్నారని విజయవాడ తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) అన్నారు. మంగళవారం నాడు నందిగామలో వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు కిషోర్, నరసింహారావులను ఆంధ్రా హాస్పిటల్‌లో ఆ పార్టీ నాయకులు కేశినేని చిన్ని, నెట్టం రఘురామ్, కార్యకర్తలు పరామర్శించారు.

విజయవాడ: వైసీపీ (YSRCP) నేతలు ఓటమి భయంతో ఫ్రస్టేషన్‌లో దాడులకు దిగుతున్నారని విజయవాడ తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) అన్నారు. మంగళవారం నాడు నందిగామలో వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు కిషోర్, నరసింహారావులను ఆంధ్రా హాస్పిటల్‌లో ఆ పార్టీ నాయకులు కేశినేని చిన్ని, నెట్టం రఘురామ్, కార్యకర్తలు పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ... నందిగామలో టీడీపీ కార్యకర్తలు కిషోర్, నరసింహారావులపై వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గ్యాంగ్ దాడి చేశారని మండిపడ్డారు. మూడు రాజధానుల అంశంపై తమ కార్యకర్తలు ప్రశ్నిస్తే మొండితోక జగన్మోహన్‌రావు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.

AP Debt: ఏపీ నెత్తిన మరో బండ.. ఆర్బీఐ నుంచి వేల కోట్ల అప్పు

దాడి చేసిన వారిపై పోలీసులు 307 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ దర్యాప్తు చేయాలని కోరారు.ఈ దాడిపై విజయవాడ సీపీ,ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. నందిగామలో మొండితోక బ్రదర్స్ అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఆయన పద్ధతి మార్చుకోకోపోతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్మోహన్ రావు బెదిరింపులు, దాడులకు తాము భయపడమని వార్నింగ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

AP Election 2024: అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?

AP Govt: పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 08:18 PM

Advertising
Advertising