AP News: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్‌కు కూటమి నేతల విజ్ఞప్తి..
ABN, Publish Date - Jun 11 , 2024 | 01:52 PM
రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు.
అమరావతి, జూన్ 11: రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ ఇచ్చారు ఎన్డీయే కూటమి నేతలు. ఈ తీర్మానాన్ని పరిశీలించిన గవర్నర్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలను ఆహ్వానించారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు అంశాలను వివరించామని తెలిపారు. శాసన సభా పక్ష నేతగా చంద్రబాబును మూడు పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఆ వివరాలను గవర్నర్‌ను కలిసి అందజేశామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించాలని కోరామన్నారు. సాయంత్రం గవర్నర్ కార్యాలయం నుంచి రాజ్యంగపరంగా పిలుపు వస్తుందన్నారు. బుధవారం నాడు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.
జనసేన పీఏసీ ఛైర్మ్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఈ విజయం ప్రజల విజయంగా భావిస్తున్నామన్నారు. గవర్నర్‌కు కూటమి తరఫున కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరామన్నారు. ఇది రాజ్యంగ పరమైన ప్రక్రియ అని.. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తారని నాదెండ్ల చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం, సుపారిపాలన కూటమితోనే సాధ్యం అని చెప్పారు.
కృష్ణా జిల్లా కేసరపల్లిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తవగా.. చిన్న చిన్న పనులను సైతం పూర్తి చేస్తున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నాయి.
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jun 11 , 2024 | 01:52 PM