AP Govt: వరద ప్రభావిత ప్రాంతాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్
ABN, Publish Date - Sep 03 , 2024 | 04:35 PM
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ప్రహహిస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ప్రజలను రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ప్రహహిస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ప్రజలను రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
నగరంలో పారిశుధ్య నిర్వహణ కోసం ఇతర మున్సిపాలిటీల నుంచి అధికారులను మంత్రి నారాయణ రప్పించారు. ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 63 మందిని పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులు నియమించారు. ఇతర మున్సిపాలిటీల నుంచి సుమారు 4 వేల మంది పారిశుధ్య కార్మికులను బెజవాడకు ప్రభుత్వం రప్పిస్తుంది.
ALSO Read: Palla Srinivas: వైసీపీ నేతల వల్లే బుడమేరుకు గండ్లు
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, స్వచ్ఛా కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ, వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర, టౌన్ ప్లానింగ్,ఇంజినీరింగ్ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మంత్రి జనార్ధన్ రెడ్డి పర్యటన...
విజయవాడ వరద ముంపు ప్రాంతంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు(మంగళవారం) పర్యటించారు. 61, 62, 63, 64వ డివిజన్లలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ బాధితులకు ఆహారం తీసుకెళ్లి మంత్రి పంపిణీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ప్రజలను ముంపు ప్రాంతం నుంచి బయటకు తీసుకు వచ్చేలా మంత్రి చర్యలు చేపట్టారు. స్థానిక అధికారులు, సహాయక బృందాలను సమన్వయం చేస్తూ ప్రజలకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు సహాయక చర్యలు అందించడంలో అధికారులు జాప్యం చేస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు.
వరద బాధితులకు సాయం కోసం...
అమరావతి: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కొసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేసింది. ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్‌కు అప్పగించింది. స్వచ్చంధంగా ముందుకు వచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్‌లో సంప్రదించాలని కోరింది.
ఇవి కూడా చదవండి...
Budameru: బుడమేరుకు తగ్గిన వరద.. గండ్లు పూడ్చివేత పనులు ప్రారంభం
Drone: డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా.. ఇప్పటి వరకు
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 03 , 2024 | 04:56 PM