ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: తొలి ప్రకటనకే వారి ప్యాంట్లు తడిచిపోయాయ్.. వైసీపీ నేతలపై బోండా ఉమ ఫైర్..

ABN, Publish Date - Feb 24 , 2024 | 06:10 PM

టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు(Bonda Uma Maheshwar Rao). చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి(Tadepalle) ప్యాలెస్ కంపించిపోయిందని.. ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ(YCP) మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.

TDP-Janasena First List

అమరావతి, ఫిబ్రవరి 14: టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు (Bonda Uma Maheshwar Rao). చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి(Tadepalle) ప్యాలెస్ కంపించిపోయిందని.. ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ(YCP) మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించిందన్నారు. అంతా సాఫీగా జరిగిందని.. వైసీపీలా కుదుపులేమీ లేవన్నారు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల్లకల్లోలమైందని విమర్శించారు. ఆ పార్టీకి చెందిన ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే జారిపోయారని.. ఇక ముందుంది మొసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు.

ఓవైపు సొంత పార్టీ నేతలు వెళ్లిపోతుండటం.. మరోవైపు టీడీపీ-జనసేన బలైమన అభ్యర్థులను ప్రకటించడంతో జగన్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని బోండా ఉమ సెటైర్లు వేశారు. టీడీపీ-జనసేన అభ్యర్ధుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలకు ప్యాంట్లు తడిశాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే సజ్జల రామకృష్ణ తెరమీదకు వచ్చి అవాకులు చవాకలు పేలారని విమర్శించారు.

ముందు ఆ సంగతి చెప్పండి..

పవన్ కల్యాణ్ సీటును ప్రకటించలేదన్న సజ్జల రామకృష్ణా రెడ్డి.. జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు బొండా ఉమ. తమ పొత్తులు, తమ సీట్ల గురించి వైసీపీ నేతలు ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారంటే వారు భయపడుతున్నట్లే కదా అని అన్నారు. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉందో లేదో చెప్పాలన్నారు. ఆయన సీటుకే గ్యారెంటీ లేదు.. మళ్లీ టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడతారా? అని బోండా ఉమ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

నోర పారేసుకోకండి..

జగన్‌ను వైసీపీ నేతలు నోరు పారేసుకోవద్దని బోండా ఉమ హితవు చెప్పారు. తాను చేసిన తప్పులకు బదిలీల పేరుతో ఇప్పటికే 77 మందిని బలి చేశారని, మళ్లీ మళ్లీ మారుస్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ఘన విజయం సాధించి.. జగన్ దోపిడీ పాలనకు, ప్రజా పీడనకు స్వస్తి పలకడం ఖాయం అని బోండా ఉమ అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2024 | 06:10 PM

Advertising
Advertising