ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: విజయవాడ కోర్టు వద్ద రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. ఉద్రిక్త పరిస్థితులు..

ABN, Publish Date - Oct 28 , 2024 | 06:39 PM

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణాల నేపథ్యంలో ఆయన వైసీపీకి మద్దతు తెలిపారు.

విజ‌య‌వాడ‌: నగరంలోని ప్రజాప్రతినిధుల కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రసాదంపాడు సర్పంచ్ నరసయ్య వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. 2019 ఎన్నిక‌ల సమయంలో వల్లభనేని వంశీ టీడీపీ తరఫున గన్నవరం అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఎన్నికల రోజు వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని అప్పటి టీడీపీ నేతలైన వల్లభనేని వంశీ, ప్రసాదంపాడు సర్పంచ్ నరసయ్య, పార్టీ శ్రేణులు రోడ్డుపై భైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేశారు.


ఎన్నికల వేళ నిరసనలకు దిగడంపై ఇద్దరి నేతలపైనా విజయవాడ పటమట పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందగా.. వల్లభనేని వంశీ మాత్రం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణాల నేపథ్యంలో ఆయన వైసీపీకి మద్దతు తెలిపారు. దీంతో వంశీ వైసీపీలో ఉండగా నరసయ్య మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు ఇదే కేసు విచారణకు ఇద్దరు నేతలూ తమ అనుచరులు, కార్యకర్తలతో కలిసి విజయవాడ కోర్టుకు వచ్చారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని నిలువరించారు.


తాజాగా ఇవాళ(సోమవారం) కేసు విచారణకు వంశీ, నరసయ్య వారివారి అనుచరులతో కోర్టు వద్దకు పెద్దఎత్తున చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. మాటలతో వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరి దాడి చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోర్టు ప్రాంగణానికి భారీగా చేరుకున్న పోలీసులు కార్యకర్తలను చెదరకొట్టారు. కోర్టు ఆవరణ నుంచి వారిని బయటకు పంపివేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Updated Date - Oct 28 , 2024 | 06:50 PM