ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: మంత్రి నిమ్మలను అభినందించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Sep 08 , 2024 | 07:52 AM

వరదల సమయంలో గండ్లు పూడ్చేందుకు ఏపీ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అమరావతి: భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. బుడమేరుకు మూడు గండ్లు పడడంతో ఈ భారీ విపత్తు సంభవించింది. చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో నగర ప్రజలను వరదలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. తినేందుకు తిండి దొరక్క, తాగేందుకు నీళ్లు లేక నానావస్థలు పడ్డారు. అయితే వరదల సమయంలో గండ్లు పూడ్చేందుకు ఏపీ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


వర్షంలోనూ..

వరదల కారణంగా బుడమేరుకు పడిన గండ్లు పూడ్చేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు దాదాపు 64గంటలపాటు నిద్ర లేకుండా పని చేశారు. బుడమేరు కట్టపైనే అధికారులు, సిబ్బందితో మకాం వేసి నిద్రాహారాలు మాని పని చేశారు. గండ్లు పూడ్చడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన పనులు చేయించారు. సీఎం సహాయంతో రంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బందికి సైతం సలహాలు, సూచనలు ఇస్తూ పనులు ముమ్మరం చేయించారు. అనుకున్న సమయం కంటే ముందుగానే పనులు పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు. నిన్న(శనివారం) పూడ్చివేత పనులు పరిశీలించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ సైతం ఆయన పడుతున్న కష్టాన్ని చూసి మెచ్చుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం మీరు చూపిస్తున్న నిబద్ధత అభినందనీయమని మంత్రిని కొనియాడారు. ఓ అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం, గాలి వస్తున్నా గొడుకు పట్టుకుని మరీ వర్షంలోనే నిమ్మల పని చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మంత్రి అంటే ఇలానే ఉండాలంటూ పలువురు నెటిజన్లు సైతం నిమ్మలను అభినందించారు.


గుడ్ జాబ్ నిమ్మల..

బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ఈ సందర్భంగా పనులు జరిగిన తీరును ఆయనకు వివరించారు. మూడు గండ్లు పూర్తి వేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. దీంతో గుడ్ జాబ్ రామానాయుడు అంటూ ముఖ్యమంత్రి ఆయణ్ని అభినందించారు. అధికారులు మంత్రుల సమావేశంలో నిమ్మలను కొనియాడారు. 64గంటలు నిద్రపోకుండా పనులు చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులకు సైతం సీఎం అభినందించారు. అలాగే ప్రస్తుతం బుడమేరు వద్ద పరిస్థితి ఎలా ఉందని, గట్టు ఎత్తు ఎంత పెంచారని మంత్రిని సీఎం అడిగి తెలుసుకున్నారు. గట్టు ఎత్తు పూర్తిస్థాయిలో పెంచి, మరోసారి తెగిపోకుండా బలోపేతం చేయాలని అధికారులు, మంత్రికి చంద్రబాబు సూచించారు. మరో రెండ్రోజులపాటు మరింత వరద వచ్చే అవకాశం ఉందని అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Updated Date - Sep 08 , 2024 | 08:03 AM

Advertising
Advertising